క్రైమ్/లీగల్

చిన్నారిపై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 5: వరంగల్ నగరంలో సంచలనం రేకిత్తించిన తొమ్మిది నెలల చిన్నారి అత్యాచారం, హత్య కేసు వేగవంతం అయ్యింది. అందుకు సంబంధించిన దర్యాప్తు పూర్తికావచ్చిందని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ తెలిపారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 19న తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసులో నిందితుడిపై నేరం రుజవయ్యే రీతిలో దర్యాప్తు పూర్తి కానున్నదని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ శుక్రవారం వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు చేపట్టిన దర్యాప్తు తీరుపై వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ నేరానికి పాల్పడిన నిందితుడు పోలేపాక ప్రవీణ్‌ను సంఘటన జరిగిన రోజు అరెస్టు చేయడంతో పాటు రిమాండ్ తరలించామన్నారు. అదేవిధంగా సంఘటన జరిగిన తీరును తెలుసుకునేందుకు నిందితుడిని కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించామని తెలిపారు. నిందితుడు పాల్పడిన నేరాన్ని నిరూపించేందుకు సీసీ కెమెరాల దృశ్యాలను సేకరించడంతో పాటు, నిందితుడికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించామనితెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు ప్రత్యేక సాక్షులతో పాటు మరో 35 మంది సాక్షులను పోలీసులు విచారించారని చెప్పారు.
అదే విధంగా చిన్నారి మరణానికి గల కారణాలను నిర్ధారించేందుకు అవసరమయ్యే పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిందని, ఈ సంఘటనకు సంబంధించి చార్జిషీట్‌ను పూర్తి చేసి త్వరలో కోర్టుకు అందజేస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇకపై ఇలాంటి నేరాలకు పాల్పడితే తప్పకుండా నేరస్ధులకు శిక్ష పడుతుందనే రీతిలో ఈ కేసును దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీస్ కమిషనర్ రవీందర్ వెల్లడించారు.