క్రైమ్/లీగల్

నన్ను టార్గెట్ చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, జూలై 6: పరువునష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి శనివారం బెయిల్ లభించింది. బీజేపీ నాయకుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ దాఖలు చేసిన పరువునష్టం కేసుపై విచారణకు శనివారంనాడు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఇక్కడి అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులు వాదించే ప్రత్యేక కోర్టు జడ్జి కుమార్ గుంజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేశారు.
బెయిల్ మంజూరైన తర్వాత రాహుల్ మాట్లాడుతూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ప్రభుత్వం వారిని లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని ఆరోపించారు. ఇదిలావుండగా, ఫిర్యాదుదారు సుశీల్ కుమార్ మోదీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది శంభు ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కేసుపై తదుపరి వాదనలను ఆగస్టు 8కి కోర్టు వాయిదా వేసిందని తెలిపారు. ‘రాహుల్‌కు బెయిల్ ఇవ్వడాన్ని మేము వ్యతిరేకించలేదు. మీ వ్యాఖ్యలపై తప్పు చేశామని భావిస్తున్నారా? అని కోర్టు రాహుల్‌ను ప్రశ్నించింది. అందుకు రాహుల్ నిరాకరించడంతో కేసును ఆగస్టు 8కి వాయిదా వేసింది’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుండగా, కోర్టు నుంచి వెళ్లే ముందు కోర్టు ప్రాంగణంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ మీడియాతో మాట్లాడుతూ దేశంలోని పేద ప్రజల కోసం కేంద్రంపై తాను చేస్తున్న పోరాటం కొనసాగుతుందని అన్నారు. ‘దేశంలోని పేదలు, రైతులు, కార్మికుల కోసం పోరాడేందుకు కట్టుబడి ఉన్నాను. ఆయా వర్గాలకు సంఘీభావం తెలిపేందుకు నేను ఈ రోజు ఇక్కడకు వచ్చాను’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘మోదీ ప్రభుత్వానికి, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా ఎవరు తమ గళాన్ని విప్పినా వారిని లక్ష్యంగా చేసుకుని కోర్టు కేసులు పెడుతున్నారు. కానీ నా కొనసాగుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుండగా, శనివారం ఉదయం రాహుల్ గాంధీ మాట్లాడుతూ తన రాజకీయ ప్రత్యర్థులైన బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ‘వేధించడం..బెదిరించడం’తోపాటు తనపై కేసు నమోదు చేయడంతో కోర్టుకు హాజరయ్యానని అన్నారు. ‘దొంగలంతా తమ పేర్ల ముందు మోదీ అని ఎందుకు పెట్టుకుంటారు’ అని రాహుల్ చేసిన వ్యాఖ్యలు పేరు చివరన మోదీ అని పెట్టుకున్నవారిని అందర్నీ అవమానించినట్టు అయిందంటూ బిహార్ బీజేపీ నాయకుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ పరువునష్టం కేసు దాఖలు చేశారు. కాగా, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త దాఖలు చేసిన పరువునష్టం కేసుపై విచారణకు ముంబయి కోర్టుకు హాజరైన రెండు రోజుల తర్వాత కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ శనివారంనాడు పట్నాలో బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ దాఖలు చేసిన పరువునష్టం కేసుపై విచారణకు కోర్టుకు హాజరయ్యారు. ఇదిలావుండగా, రాహుల్ శనివారం ఉదయం ఇక్కడి విమానాశ్రయానికి చేరుకున్నపుడు పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇక్కడి కోర్టులో విచారణకు రాహుల్ గట్టి బందోబస్తు మధ్య హాజరయ్యారు. విచారణ అనంతరం రాహుల్ గాంధీ కోర్టు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా అప్పటికే అక్కడకు చేరుకున్న పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
చిత్రం...ఓ పరువు నష్టం కేసులో శనివారం పాట్నా ప్రత్యేక కోఠ్టుకు హాజరైన అనంతరం
మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ