క్రైమ్/లీగల్

పత్తి రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండూర్, జూలై 6: నల్లగొండ జిల్లా చండూర్ మండల కేంద్రంలో శనివారం అప్పుల బాధతో గండూరి నరసింహ(49) ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు రైతు నరసింహ తనకున్న నాలుగున్నర ఎకరాలతో పాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. గత ఏడాది పత్తి సాగులో చేసిన అప్పులు తీరకపోవడం, ఈ ఏడాది ఆదిలోనే వర్షాలు లేక విత్తన, సాగు పెట్టుబడులు నష్టపోవడంతో మనస్తాపానికి గురై అప్పులు తీరే దారి లేక నరసింహ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులంతా పత్తి చేనులో పనికి వెళ్లిన సమయంలో సొంత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతూరు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పంఛనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు.