క్రైమ్/లీగల్

నలుగురు మావోల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 6: చత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. ధంతరి జిల్లాలోని అటవీ ప్రాంతంలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో భాగంగా స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) బలగాలు రెండ్రోజులుగా మావోల కోసం గాలిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఖల్లారి - మోచ్కా గ్రామాల మధ్య అడవుల్లో ఎస్టీఎఫ్, బీఎస్‌ఎఫ్ బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. గంటన్నర పాటు హోరాహోరీ కాల్పులు జరిగాయి. కొందరు మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. కాల్పుల అనంతరం బలగాలు అక్కడ గాలించగా నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కాల్పులు ఆగిపోయాయని, మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతుందని, మృతులను గుర్తించే పనిలో ఉన్నామని రాయ్‌పూర్ రేంజ్ ఇన్స్‌పెక్టర్ జనరల్ (ఐజీ) ఆనంద్ చాబ్రా తెలిపారు. కాగా భద్రతా బలగాల కాల్పుల్లో పలువురు మావోయిస్టులు గాయపడినట్లు భావిస్తున్నారు.
చిత్రం... మృతదేహాలను తరలిస్తున్న బలగాలు