క్రైమ్/లీగల్

వృద్ధురాలిని మోసం చేసిన న్యాయవాది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూలై 6: వృద్దురాలిని నమ్మించి మోసం చేసిన అడ్వెకేట్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కథనం ప్రకారం.. అమీర్‌పేట నిరజ్ పబ్లిక్ స్కూల్ సమీపంలోని పద్మావతి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే 75 ఏళ్ల శ్యామల అలియాస్ కామేశ్వరి గత రెండేళ్ల క్రితం న్యాయవాదిని కలిసేందుకు నాంపల్లికి వెళ్లింది. ఆ సమయంలో సదరు న్యాయవాది కార్యాలయం మూసి ఉండటంతో వెనుతిరిగింది. ఇది గమనించిన సుధీర్‌కుమార్ అనే అడ్వకేట్ తాను కూడా న్యాయవాదినేనని పరిచయం చేసుకున్నాడు. వివిధ విషయాలపై చర్చించిన అంనతరం తిరిగి వెళుతున్న వృద్దురాలిని ఎక్కడ ఉంటారని ఆరాతీసి అమీర్‌పేట అని చెప్పడంతో తాను అటువైపునే వెలుతున్నానని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. ఇంటి వరకు దింపేందుకు వచ్చిన అతన్ని ఇంట్లోకి ఆహ్వానించి కాఫీ ఇచ్చింది. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అమ్మమ్మ అని సంబోధిస్తూ అప్పడప్పుడు ఇంటికి రావడం ప్రారంభించాడు. ఒకరోజు వృద్దురాలి ఇంట్లోనే బస చేసిన సుధీర్ స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లను దొంగిలించి వాటిని ఇతరులకు విక్రయించాడు. చాలా కాలం తరువాత విషయం తెలుసుకున్న శ్యామల ఈనెల 2న పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుధీర్ కుమార్‌ను అదుపులోనికి తీసుకొని విచారించగా చేసిన తప్పును ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని న్యాయమూర్తి ముందు హాజరు పరచగా 14 రోజుల జుడీష్యిల్ రిమాండ్‌కు తరలించారు.