క్రైమ్/లీగల్

ఆ రెండు బిల్లులను రాష్టప్రతి తిరస్కరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 6: తమిళనాడు ప్రభుత్వం 2017లో నేషనల్ ఎలిజిబిలిటి-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ రాష్ట్రపతికి పంపించిన రెండు బిల్లులను ఆయన తిరస్కరించారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మద్రాస్ హైకోర్టుకు తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఈ విషయమై సమాచారం ఉందని హైకోర్టుకు చెప్పారు. తమిళనాడు అడ్మిషన్ టు ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ బిల్, 2017, తమిళనాడు అడ్మిషన్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇన్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ- బిల్లులను రాష్టప్రతి తిరస్కరించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తమకు సమాచారం ఇచ్చిందని ఆ న్యాయవాదులు తెలియజేశారు. ఈ రెండు బిల్లులు 2017 ఫిబ్రవరి 20వ తేదీన రాష్టప్రతి కార్యాలయానికి అందాయని వివరించారు. న్యాయమూర్తులు ఎస్.మణికుమార్, సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్‌కి న్యాయవాదులు ఈ విషయం చెప్పారు. ఈ రెండు బిల్లులను నిలిపి ఉంచారా? తిరస్కరించారా? అనే విషయం స్పష్టం చేయాలని ధర్మాసనం అడిగినప్పుడు న్యాయవాదులు తిరస్కరించినట్టు తెలిపారు. సంబంధిత పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చినప్పుడు ఈ రెండు బిల్లులను తిరస్కరించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.