క్రైమ్/లీగల్

ఆ భవనాలు కూల్చొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: నూతన సచివాలయం నిర్మాణం కోసం ఎర్రమంజిల్ భవనాలను కూల్చివద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు సోమవారం విచారించింది. ఎర్రమంజిల్ భవనాలను కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ఇప్పికే ధర్మాసనం ముందు బ్యాచ్ పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానంలో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుతం ఆ భవనాలపై యథాతథ స్థితి కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సచివాలయం, ఎర్రమంజిల్ భవనాలను కూల్చివేయబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా దీనిపై కౌంటర్ దాఖలుకు 15 రోజుల గడువు కావాలన్న ప్రభుత్వ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో సాయంత్రమే తమ వాదనలు వినిపిస్తామని అదనపు అడ్వొకేట్ జనరల్ చెప్పారు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ కట్టడాలపై గవర్నర్‌కు నిర్ణయాధికారం ఉంటుందని పిటిషనర్ తరఫున న్యాయవాది పేర్కొన్నారు. సెక్షన్
8(2)(3) ప్రారం భవనాలు శాంతి భద్రతలపై ఉమ్మడి రాజధానిపై నియంత్రణాధికారం గవర్నర్‌కే ఉంటుందని, చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక కట్టడాలు వందేళ్లు దాటితే వాటిని కూల్చడానికి వీలు లేదని వాదించారు. వందేళ్లు దాటిన కట్టడాలను ఆర్కియాలజీ భవనాలుగా గుర్తించాలని అన్నారు. దానిపై ఎర్రమంజిల్ భవనాలను జాతీయ సంపదగా ఆర్కియాలజీ శాఖ గుర్తించిందా? అని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటి వివరాలు తమ వద్ద ప్రస్తుతం లేవని , పూర్తి వివరాలను త్వరలోనే తమ కౌంటర్‌లో దాఖలుచేస్తామని పిటిషనర్ బదులిచ్చారు. గూగుల్ మ్యాప్‌లో రెండు భవనాలు, పరిసరాలను హైకోర్టు న్యాయమూర్తులు పరిశీలించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకే నూతన భవనాలను నిర్మిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని అదనపు అడ్వకేట్ జనరల్ చెప్పారు. వెంటనే తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
ప్రజా విజయం
ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయంచిన పిటిషనర్లలో ఒకరైన విశే్వశ్వరరావు మాట్లాడుతూ కొత్త భవనాలు వల్ల ప్రజాధనం వృధా చేయడమేనని అన్నారు. ఈ అంశంపై సుమారు మూడు గంటల పాటు వాదనలు సాగాయని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని, తాము కూడా కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం విశాలంగా ఎంతో బావుందని, కొత్త సచివాలయం ఈ దశలో అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ కమిటీ ప్రస్తుత సచివాలయం పనికి రాదని ఎలాంటి నివేదిక ఇవ్వలేదని, కేసు తేలేంత వరకూ భవనాలను కూల్చివేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం ప్రజా విజయమని అన్నారు.