క్రైమ్/లీగల్

మాజీ సర్పంచ్ శంకర్‌పై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జూలై 8: ఏదులాబాద్ మాజీ సర్పంచ్ బట్టే శంకర్‌పై నగరానికి చెందిన కిరాయి గుండాలు క్రికెట్ వికెట్లు, కత్తులు, కారంతో దాడికి పాల్పడటంతో గ్రామస్థులు అడ్డుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం సంచలనం సృష్టించింది. ఫోలీసులు, బాధితుడు శంకర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఏదులాబాద్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బట్టే శంకర్ తనకు వారసత్వంగా వచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు పునాది తీస్తుండగా అదే గ్రామానికి చెందిన కాలేరు సురేందర్ నాలుగు రోజుల కిందట అభ్యంతరం తెలిపినట్లు చెప్పారు. గ్రామస్థులు.. బట్టే శంకర్‌కు వారసత్వంగా వచ్చిన స్థలంగా నిర్ణయించటంతో సోమవారం నిర్మాణ పనులు చేస్తుండగా కాలేరు సురేందర్‌తో పాటు అతని సోదరులు, కుమారులతో పాటు నగరానికి చెందిన కిరాయి రౌడీలు దాడికి యత్నించినట్లు చెప్పారు. జిల్లా బీజేపీ నాయకుడు కాలేరు రామోజీతో పాటు కాలేరు సురేందర్ దాడికి దిగినట్లు తెలిపారు. పది మంది కిరాయి రౌడీలు టవేరా కారులో మరణాయుధాలను తెచ్చుకుని దాడి చేసేందుకు వెళ్తుండగా గమనించిన గ్రామస్థులు పట్టుకునేందుకు యత్నించటంతో ఐదుగురు పరారు కాగా మరో ఐదుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. కిరాయి రౌడీలు వాడిన కారులో కత్తులు, క్రికెట్ వికెట్లు, కారంపొడి పాకెట్లు ఉండటంతో గ్రామస్థులు ఒక్కసారికి ఉలిక్కి పడ్డారు. కాలేరు సురేందర్, అతని అన్నదమ్ములు, బీజేపీ నేత రామోజీతో పాటు దాడికి పాల్పడిన కిరాయిగుండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తు శంకర్‌తో పాటు గ్రామస్థులు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమింపచేశారు. దాడికి యత్నించిన సురేందర్, బీజేపీ నేత కాలేరు రామోజీతో పాటు మరో 20 మందిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ రఘువీర్ రెడ్డి తెలిపారు.