క్రైమ్/లీగల్

ఏ మాత్రం పురోగతి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: వివాదాస్పద అయోధ్య సమస్యను చర్చల ద్వారా సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ఓ ప్యానల్ ఏర్పాటైనప్పటికీ ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధ్యం కాలేదు.
ఈ నేపథ్యంలో ఈ కేసును త్వరితగతిన విచారణకు చేపట్టాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీం కోర్టు మంగళవారం అంగీకరించింది. సయోధ్య ప్యానల్ ఏర్పాటైనప్పటికీ అయోధ్య సమస్య పరిష్కారంపై ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు సాధ్యం కానందును తన పిటిషన్‌ను విచారణకు చేపట్టాలని, ఈ కేసులో మొట్టమొదటి కక్షిదారుల్లో ఒకరైన గోపాల్ సింగ్ విశారద్ ఈ పిటిషన్‌లో కోరారు. దీనిని పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ కేసును వేగంగా విచారణ చేపట్టాలని అభ్యర్థన చేసుకున్నారా? అంటూ కోర్టు అడిగిన ప్రశ్నకు పిటిషన్‌దారు తరపు న్యాయవాది పీఎస్ నర్సింహా అవునని జవాబు ఇచ్చారు. అయోధ్య సమస్య పరిష్కారానికి ఏర్పాటైన త్రిసభ్య ప్యానల్‌కు ఆగస్టు 15 వరకు సుప్రీం కోర్టు గడువు ఇచ్చిన నేపథ్యంలో ఈ తాజా పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయంగా ఎంతో సునిశితమైన అయోధ్య కేసును సామరస్య పూర్వకంగా పరిష్కరించగలమన్న ధీమా తమకు ఉందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఖలీఫుల్లా సారథ్యంలోని ఈ ప్యానల్ ఇప్పటికీ కోర్టుకు స్పష్టం చేసింది. ఇందులో ఇతర సభ్యులుగా ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులు సభ్యులుగా ఉన్నారు. అయోధ్యపై ఏర్పాటైన సయోధ్య ప్యానల్ సమస్య పరిష్కారంపై ఎంతో ధీమాగా ఉందని, ఇందుకోసం ఆగస్టు 15 వరకు గడువు ఇవ్వాలని పేర్కొన్న ధర్మాసనం ‘అదనపు సమయాన్ని ఇవ్వడంలో తప్పేమిటి?’ అని ప్రశ్నించింది. దశాబ్దాలుగా ఈ సమస్య పెండింగ్‌లో ఉందని, పరిష్కారానికి సానుకూల పరిణామాలు నెలకొంటున్నప్పుడు ఆ ప్యానల్‌కు అదనపు గడువు ఎందుకు ఇవ్వకూడదని కూడా మే 10 న ఇచ్చిన గడువు పొడగింపు ఉత్తర్వులు సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అయితే ఇంతవరకు ఎలాంటి పురోగతి కనిపించలేదంటూ ఈ తాజా పిటిషన్ దాఖలైన విషయం గమనార్హం.