క్రైమ్/లీగల్

ఉత్తర్వును ఆపేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని నిబంధనలు అమాయకులను భయాందోళనలకు గురిచేయకూడదని, వారి ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ చట్టంలోని కొన్ని నిబంధనలపై మార్చి 20న ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీ చట్టానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం, ఈ చట్టంలో యాంటిసిపేటరీ బెయిల్ పొందే విషయంలో ఇతర చట్టాలకు భిన్నంగా నిబంధనలు ఉన్నాయని, ఈ చట్టం ప్రకారం అమాయకులకు పరిష్కారం చూపే లేదా సహాయం చేసే ఏ యంత్రాంగమూ అందుబాటులో లేదని పేర్కొంది. ‘అమాయకులు శిక్షింపబడకూడదు. వారు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనల కారణంగా భయాందోళనలకు గురికాకూడదని మేం చెబుతున్నాం. జీవించే హక్కు ఎవరికీ అందకుండాపోకూడదన్నది మా అభిప్రాయం. ఈ చట్టంపట్ల, ఫిర్యాదుదారులపట్ల మాకు ఎటువంటి వ్యతిరేకత లేదని చాలా స్పష్టంగా చెబుతున్నాం’ అని జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్, యూయూ లలిత్‌లతోకూడిన ధర్మాసనం పేర్కొంది. మార్చి 20న ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్ధించుకుంది. కాగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార
నిరోధక చట్టం కింద కేసు నమోదైనప్పుడు నిందితుడిని తక్షణం అరెస్టు చేయకుండా, ఉద్దేశపూర్వకంగా అతడిని కేసులో ఇరికించారేమోనన్నది విచారణ జరిపాక చేయాలని, ఒకవేళ కేసు వెనుక దురుద్దేశం ఉంటే బెయిల్ ఇవ్వొచ్చంటూ ఈనెల 20న ఇచ్చిన తీర్పుతో దేశవ్యాప్తంగా దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందంటూ విమర్శలు రేగడం, అందుకు నిరసనగా సోమవారం నిర్వహించిన భారత్‌బంద్ హింసాత్మకంగా మారి 11మంది మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ తీర్పును పునఃసమీక్షించాలంటూ కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. చట్టంలో మేధోపరమైన లోపాలుంటేనే తీర్పును పునఃసమీక్షిస్తామని, కానీ అమాయకుల ప్రాథమిక హక్కులను ఫణంగా పెట్టలేమని స్పష్టం చేసింది.
తీర్పుపై ‘ఆందోళన చేస్తున్నవారు తమ ఆదేశాన్ని చదివి ఉండకపోవచ్చు. ఆ తీర్పులో ఏముందో వారికి తెలిసి ఉండకపోవచ్చు. లేదా స్వార్థ ప్రయోజనాలకోసం ఎవరైనా వారిని తప్పుదారి పట్టించి ఉండొచ్చు’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు ఆర్టికల్ 21 వర్తిస్తుందని చెప్పగా, అది పౌరులందరికీ వర్తిస్తుందన్న కోర్టు తమ తీర్పు ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయడం లేదని స్పష్టం చేసింది. ‘ఈ చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా అమాయకులు అరెస్టు కాకుండా రక్షణ కోసం ఆదేశాలిచ్చాం’ అని పేర్కొంది. అమాయకుల స్వేచ్ఛను పరిహరిస్తామంటే కుదరదని చెప్పింది. కాగా ఈ వ్యవహారంలో ఎవరైనా రాతపూర్వక ఫిర్యాదులను మూడురోజుల్లోగా దాఖలు చేయవచ్చని, మరో పదిరోజుల్లో ఈ అంశాన్ని మరోసారి విచారిస్తామని పేర్కొంది.
చట్టాన్ని నిర్వీర్యం చేయడం లేదు: రాజ్‌నాథ్
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయడంలో ప్రభుత్వ పాత్ర లేదని, వెనుకబడిన దళిత వర్గాల హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో జీరో అవర్‌లో సూమోటోగా ఈ అంశాన్ని ప్రస్తావించిన రాజ్‌నాథ్ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంపై మార్చి 20న సుప్రీకోర్టు తీర్పుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారని, ఈ కేసులో ప్రభుత్వం పాత్రధారి కాదని స్పష్టం చేశారు. ఏనీడయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, వెనుకబడి వర్గాల కోసం ఏం చేసిందీ విపులంగా వివరించారు.