క్రైమ్/లీగల్

ఆ హత్య వెనక కోగంటి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. విజయవాడకు చెందిన కోగంటి సత్యం అనే వ్యాపారవేత్త ప్రమేయంతోనే రాంప్రసాద్ హత్య జరిగిందని టాస్క్ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. దీని వెనక మొత్తం ఎనిమిది మంది హస్తం ఉందని మంగళవారం ఇక్కడ తెలిపారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. రాంప్రసాద్‌పై దాడి జరిగినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సత్యంను అదుపులోకి తీసుకొని విచారింనిన పోలీసులు సంచలన విషయాలను రాబట్టారు. రాంప్రసాద్‌ను ఆరు నెలల క్రితమే హత్య చేసేందుకు సత్యం ప్రణాళికను రూపొందించినట్లు చెబుతున్నారు. నెల రోజుల క్రితమే కోగంటి అనుచరుడు పంజాగుట్టలో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. పక్కా ప్లాన్‌తో సత్యం డైరెక్షన్‌లోనే హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ విషయం బయటపెట్టకుండా ఉండేందుకు కోగంటి జాగ్రత్త పడ్డాడు. రాంప్రసాద్ హత్యకు కోగంటి రూ.30 లక్షలు సుపారి ఇచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. కోగంటి వాడిన ఐదు సెల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాడిన వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదుపులో ఉన్న వ్యక్తులు ఇచ్చిన వివరాల ఆధారంగా వాహనం, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా రాంప్రసాద్‌ను హత్య చేసింది తానే అంటూ శ్యామ్ మీడియాకు చెప్పిన విషయం విదితమే. ఈ హత్యతో కోగంటికి ఎలాంటి సంబంధం లేదని అతడు తెలిపాడు. పైగా రాంప్రసాద్ వల్ల తాను తీవ్రంగా నష్టపోయానని శ్యామ్ పేర్కొన్నాడు. రాంప్రసాద్ నుంచి తనకు రూ.15 లక్షలు రావాల్సి ఉందని, తనను కలిసిన రాంప్రసాద్ బావమరిది షర శ్రీనివాస్ సుపారీ ఇచ్చాడని మీడియాకు తెలిపాడు. హత్య చేస్తే రూ.30 లక్షలు చెల్లిస్తానంటూ ఒప్పందం చేసుకున్నట్లు వివరించాడు.