క్రైమ్/లీగల్

ఎన్నికల అఫిడవిట్‌లో ఎమ్మెల్యే కరణం బలరాం తప్పుడు సమాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 9: చీరాల శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి ఎన్నికల కమిషన్‌కు అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కరణం బలరాం నాలుగో సంతానంగా అంబిక జన్మించిందనేందుకు ఆధారాలు ఉన్నాయన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరణం బలరాం ఎన్నికల నామినేషన్ పత్రాల్లో నలుగురు సంతానం అయితే ముగ్గురిగా చూపారని, ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు. ఆయన ఏదైతే ముగ్గురు పిల్లలని చెప్పి ఉన్నారో వారుకాకుండా కరణం అంబికాకృష్ణ డాటరాఫ్ కరణం బలరాం అని తెలియజేసేందుకు ఆధారాలు ఉన్నాయన్నారు. అంబికా చిన్నతనంలో అన్నప్రాసన దగ్గర నుంచి ప్రతి పుట్టినరోజు బలరాం కార్యక్రమాలు నిర్వహించారంటూ సంబంధిత ఫొటోలను విలేఖరుల ముందు ప్రదర్శించారు. ఇవికాకుండా సెయింట్ థెరిస్సా ఆసుపత్రిలో కరణం బలరాం అంబిక తండ్రిగా ఇచ్చిన బర్త్ సర్ట్ఫికెట్, 10వ తరగతి సర్ట్ఫికెట్‌లో, ఎంసెట్ హాల్ టికెట్‌లో, డిగ్రీ ప్రొవిజనల్ సర్ట్ఫికెట్, ఆధార్ కార్డులో, బ్యాంక్ అకౌంట్‌లో, ఉస్మానియా యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌బీ చేయడానికి ఇచ్చిన వినతిపత్రం, కండక్ట్ సర్ట్ఫికెట్‌లో తండ్రిగా బలరాం పేరే నమోదు అయిందన్నారు. ఇవి శాస్ర్తియ ఆధారాలు కావంటే ఈ ఫొటోలు, సర్ట్ఫికెట్లు ఫోరెన్సిక్ ద్వారా పరీక్షించవచ్చని, అదికూడా కాదంటే డీఎన్‌ఏ పరీక్షలకు సైతం సిద్ధంగా ఉన్నానని అంబికా తనకు తెలియజేసినట్లు ఆమంచి చెప్పారు. ఈ ఆధారాలన్నింటీతో పాటు తాను హైకోర్టులో దాఖలు చేసిన పేపర్లలో అంబిక సంతకం చేసిందని, అంబిక చాలా ఆత్మగౌరవం కలిగిందని, ఎం ఫార్మసీ చేసి నల్సార్ యూనివర్శిటీలో లా చదివిందని తెలిపారు. కాట్రగడ్డ ప్రసూన - కరణం బలరాంకు కుమార్తె కాకుండా పేరొందిన రాజకీయవేత్త ఆచార్య ఎన్జీ రంగాకు ఆమె దగ్గరి బంధువని కూడా చెప్పారు.