క్రైమ్/లీగల్

కోట్లకు పడగలెత్తిన జీఎస్టీ అధికారి గాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నాయన్న ఆరోణలతో హైదరాబాద్‌లోని జీఎస్టీ సీనియర్ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ఇళ్లపై మంగళవారం సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్ కార్యాలయాలు, నివాసంలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. గాంధీపై ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నట్టు కేసు నమోదు చేశారు. రూ.200 కోట్లు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్టు తెలిసింది. పదేళ్లకు పైగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో విధులు నిర్వహించిన బొల్లినేని గాంధీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ ఆస్తులు కూడగట్టిన్నట్లు అభియోగం. ప్రస్తుతం ఆయన జీఎస్టీ సీనియర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన వద్ద రూ.3.75 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించారు. గాంధీతో పాటు ఆయన భార్య బొల్లినేని శిరీషపై కూడా కేసు నమోదు చేశారు. రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరికి సంబంధించిన కేసును విచారణ చేసిన గాంధీ టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పలు ఫైళ్లలో మార్పులు చేసినట్టు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఈడీ, కేంద్ర ఆర్థిక శాఖ, సీఏంవో కార్యాలయం నుంచి అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సీబీఐ అధికారులు దృష్టిపెట్టారు. గతంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం నుంచి బదిలీ అయినా అనధికారికంగా నెలరోజులకు పైగా ఇక్కడే కొనసాగారని ఆరోపణలున్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో అనేక మంది టీడీపీ నాయకులకు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోడానికి సహకరించినట్లు శ్రీనివాస్ గాంధీపై అభియోగాలు మోపబడ్డాయి. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. కూకట్‌పల్లిలోని ఓ బ్యాంక్ అకౌంట్‌లో రూ.20 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా బంధువుల పేరుతో బినామీ అకౌంట్లున్నట్టు వాటిలో రూ.10 లక్షలున్నట్లు గుర్తించారు. ఈడీ, జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీనివాస్ గాంధీ అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులున్నాయి. హైదరాబాద్‌లోని మదీనాగూడ, కంకిపాడు, ప్రొద్దుటూరులో అక్రమ ఆస్తులున్నట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. 1992లో సెంట్రల్ ఎక్సైజ్‌లో ఇన్స్‌పెక్టర్‌గా చేరిన గాంధీ 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందారు. 2003లో డీఆర్‌ఐలో విధులు నిర్వహించారు. 2004 నుంచి 2007 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో విధులు నిర్వహించిన బొల్లినేని అనేక అక్రమాలకు పాల్పడిన్నట్లు అధికారులు గుర్తించారు.