క్రైమ్/లీగల్

యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్ : నగరంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతి గొంతు కోసి తాను ఆత్మహత్యా యత్నం చేశాడో ఉన్మాది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేష్ (24), హైదరాబాద్ బల్కంపేటకు చెందిన మనస్వి(22) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏస్ అకాడమీలో ఆర్‌ఆర్‌బీ కోచింగ్ తీసుకున్నారు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని వెంకటేష్ ప్రేమ గా మలుచుకున్నాడు. వెంకటేష్ ప్రవర్తన నచ్చని మనస్వీ అతడిని దూరంగా పెట్టిం ది. దీంతో అతడు కక్ష పెట్టుకున్నాడు. వెంకటేష్ దిల్‌సుఖ్‌నగర్‌లోని బృందావన్ ప్రైడ్ అనే లాడ్జిలో రూమ్‌ను అద్దెకు తీసుకున్నాడు. మంగళవారం మనస్వికి ఫోన్ చేసి రూమ్‌కు రప్పించాడు. కాస్సేపు మాట్లాడుకున్నాక ఇరువురి మధ్యా వాగ్వాదం జరిగింది. ముందే పథకం వేసుకున్న అతడు వంట గదిలో ఉపయోగించే పదువైన రెండు కత్తులను తెచ్చుకున్నాడు. కత్తితో మనస్వి గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. తల్లి వేమూరి కమలకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించింది. తల్లి, సోదరుడు శ్రీతేజ లాడ్జిని వెదుక్కూ వచ్చాడు. లాడ్జి సిబ్బంది సహకారంతో తలుపులను పగలగొట్టి రక్తపు మడుగులో ఉన్న మనస్విని కొత్తపేటలోని ఓనీ ఆసుపత్రికి తరలించారు. ప్రేమోన్మాది వెంకటేష్ కత్తితో కడుపులో పొడుచుకున్నాడు. అలాగే చేతిని కోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మనస్వి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇద్దరూ అపస్మారక స్థితిలో ఉండటంతో మరిన్ని వివరాలను సేకరించలేక పోయామని పోలీసులు పేర్కొన్నారు.