క్రైమ్/లీగల్

వలస వ్యాపారుల అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 9: ప్రముఖ కంపెనీ బ్రాండ్‌ను ఉపయోగించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముగ్గురు నిందితులను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన రాజురామ్ (36), హరీష్ శర్మ (21), శశి శర్మ (23) ఓల్డ్ బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్నారు. ముగ్గురు కలిసి వీఆర్‌ఎల్ మార్కెటింగ్ నిర్వహిస్తున్నారు. పేట్‌బషీరాబాద్‌లోని వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్ లిమిటెడ్ కంపెనీ పేరుతో కూడిన వీఆర్‌ఎల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ ప్రైవేటు లిమిటెడ్‌ని అక్రమంగా కొనసాగిస్తున్నారు. వీఆర్‌ఎల్ కంపెనీ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా రాజురామ్, హరీష్ శర్మ, శశి శర్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.