క్రైమ్/లీగల్

6లోగా కౌంటర్ దాఖలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసెంబ్లీ సభ్యత్వం రద్దుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 6వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఒక వేళ కౌంటర్ దాఖలు చేయని పక్షంలో, కౌంటర్ అఫిడవిట్ లేకుండానే కేసు విచారణ చేపడతామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో తమ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. మంగళవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈసందర్భంగా హైకోర్టులో ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు గడువు కావాలని కోరారు. అఫిడవిట్‌ను దాఖలు చేయాలని, ఇక ఏ మాత్రం గడువు ఇవ్వలేమని కోర్టు పేర్కొంది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
ఏపి, తెలంగాణ హోంశాఖలకు హైకోర్టు నోటీసులు
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్స్ అడిగిన విధంగా వివరాలు అందించకపోవడానికి కారణాలు తెలియచేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం ఆంధ్ర, తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, డీజీపీలను ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె విజయ లక్ష్మితో కూడిన ధర్మాసనం యాగేష్ తాండవ అనే న్యాయ విద్యార్థి దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించింది. అనంతరం ఈ కేసు విచారణను మూడు వారాల పాటు వాయిదావేశారు.
అబార్షన్లపై కుటుంబ సంక్షేమ శాఖ, హోంశాఖ కార్యదర్శులకు నోటీసులు
నగరంలోని ప్రైవేట్ నర్సింగ్ హోంలలో అర్హతలేని వైద్యులు లింగ నిర్ధారణ పరీక్షల్లో ఆడ శిశువు అని తెలిసినవెంటనే అబార్షన్లు చేస్తున్నారని, ఇది అనైతికమంటూ నగరానికి చెందిన ఆర్ సందీప్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ కేసులో వారం లోపల నివేదిక ఇవ్వాలని కుటుంబ సంక్షేమశాఖ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, నగర పోలీసు కమిషనర్, జిల్లా వైద్యాధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పిటిషనర్ తరఫున ఎస్‌ఆర్ శంకు వాదనలు వినిపించారు. నగరంలోని ఒక నర్సింగ్ హోంలో అక్రమంగా అబార్షన్లు జరుగుతున్నాయంటూ వీడియో క్లిప్పింగ్‌లు, ఫోటోలను కోర్టుకు సమర్పించారు.
పార్కింగ్ అక్రమ వసూళ్లపై
రెండురాష్ట్రాలకు నోటీసులు
పబ్లిక్ ప్రదేశాల్లో పార్కింగ్ ఫీజును అక్రమంగా వసూలు చేయడాన్ని అరికట్టడంలో రెండు రాష్ట్రప్రభుత్వాలు వైఫల్యం చెందాయంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై స్పందించాల్సిందిగా కోరుతూ హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
ఈ పిల్‌ను నగరానికి చందన ఇంద్రసేన చౌదరి దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున వై బాలాజీ అనే న్యాయవాది వాదనలు వినిపించారు. అనంతరం ఈ కేసును హైకోర్టు మూడు వారాల పాటు వాయిదా వేసింది.