క్రైమ్/లీగల్

ముందు 18వేల కోట్లు డిపాజిట్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. దేశం విడిచి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆయన చేసిన అభ్యర్థనను హైకోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది. అయితే, రుణదాతలకు చెల్లించాల్సిన 18,000 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాతే దేశం విడిచి వెళ్లాలని సూచించింది. ఢిల్లీ విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నరేష్ గోయల్ చేసిన అభ్యర్థనను పరిశీలించిన తర్వాత హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ)ను సవాల్ చేస్తూ గోయల్ చేసిన అభ్యర్థనపై కేంద్రం నుంచి సమాచారం కోసం ఆశిస్తున్నట్టు కోర్టు తెలిపింది. ‘మీరు 18,000 కోట్ల రూపాయలు గ్యారంటీతో బ్యాంకులో డిపాజిట్ చేస్తే దేశం విడిచి వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని న్యాయమూర్తి గోయల్‌కు స్పష్టం చేశారు. 18,000 కోట్ల రూపాయల భారీ మోసం అంశంతో సంచలనం రేపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించి, ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేయడంతో దీనిపై సీరియస్ ఫ్రాడ్ ఇనె్వస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మే 25న తనపై లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేయడంతో దానిని సవాల్ చేస్తూ నరేష్ గోయల్ కోర్టును ఆశ్రయించారు. అయితే, విమానం నుంచి దుబాయ్‌లో దిగిన గోయల్‌పై ఈసీఐఆర్/ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. తన భార్యతో కలసి లండన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో దుబాయ్‌లో దించేశారని, అక్కడే తనకు లుక్ ఔట్ సర్క్యులర్ జారీ అయిన విషయం తెలిసిందని గోయల్ కోర్టుకు విన్నవించారు. ఇదిలావుండగా, ఈ కేసుకు సంబంధించి నాలుగు వారాల్లోగా తమ అభిప్రాయలను వెల్లడించాలని కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు, లా అండ్ జస్టిస్‌లను హైకోర్టు కోరింది.