క్రైమ్/లీగల్

దళిత బాలికపై గ్యాంగ్‌రేప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగుళూరు, జూలై 10: దళిత బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి గర్భవతిని చేసిన సంఘటన దక్షిణ కన్నడ జిల్లాలోని విఠల్ ప్రాంతంలో చోటు చేసుకొంది. ఈ దారుణానికి ఒడిగట్టిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత డిసెంబర్ నెలలో ఐదుగురు యువకులు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టగా ఆమె ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అని తేలినట్లు పోలీసులు తెలిపారు. ఆశా వర్కర్ ఒకరు బాలిక ఇంటికి వెళ్లి మాట్లాడిన నేపథ్యంలో సంఘటన వెలుగులోకి రావడంతో పాటు గర్భవతి అని తేలింది. ఐదుగురు వ్యక్తుల పేర్లు చెబుతూ బాలిక చేసిన ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 376, 506, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. పదో తరగతి పాసైన ఆ బాలికను సోదరుడి వరుసైన గణేష్.. సుబ్రహ్మణ్య అనే మరో వ్యక్తితో కలిసి తొలుత దారుణానికి ఒడిగట్టారు. అనంతరం వివిధ సందర్భాల్లో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఈమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ‘సంఘటనను బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని’ వీరు తనను బెదిరించినట్లు బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. దళిత బాలికపై కళాశాల విద్యార్థులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఉదంతం రాష్టవ్య్రాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. కేసు విచారణలో ఉందనీ, నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.