క్రైమ్/లీగల్

సుప్రీంను ఆశ్రయించిన రెబల్ ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : కర్నాటకలో తలెత్తిన రాజకీయ సంక్షోభం సుప్రీం కోర్టుకు చేరింది. కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన 10 మంది రెబల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌పై ఫిర్యాదు చేశారు. తమ రాజీనామాలు ఆమోదించకుండా స్పీకర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రెబల్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రొహ్‌త్గీ పిటిషన్ వేశారు. పరిస్థితి తీవ్రతను గుర్తించి పిటిషన్‌ను అర్జంట్‌గా విచారణకు స్వీకరించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను రొహత్గీ అభ్యర్థించారు. అసమ్మతి ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేశారని, అయితే స్పీకర్ ఉద్దేశపూర్వకంగా వాటిని ఆమోదించడం లేదని పిటిషనర్ ఆరోపించారు. రాజీనామాలు ఆమోదించకుండా స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని రొహ్‌త్గీ ఫిర్యాదు చేశారు. 10 మంది రాజీనాలు ఆమోదిస్తే ప్రభుత్వం పడిపోతుందని, దాన్ని కాపాడేందుకు స్పీకర్ విధులను దుర్వినియోగం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు దీపక్ గుప్తా, అనిరుధాబోస్‌తో కూడిన ధర్మాసనం ‘మేం పరిశీలిస్తాం’అని తెలిపింది. పిటిషన్‌ను అర్జంట్‌గా విచారించాలన్న ముకుల్ రొహ్‌త్గీ అభ్యర్థనకు ‘సమయం రానీయండి’అని బెంచ్ వ్యాఖ్యానించింది. రాజీనామాలు ఆమోదించేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని రెబల్స్ కోర్టును కోరారు. ప్రతాప్ గౌడ పాటిల్, రమేష్ జార్కిహోలి, బీ బసవరాజ్, బీసీ పాటిల్, ఎస్‌టీ సోమశేఖర్, అర్బయిల్ శివరాం హెబ్బార్, మహేష్ కుమాతల్లి, కే గోపాలయ్య, ఏహెచ్ విశ్వనాథ్, నారాయణ గౌడ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా 14 మంది రాజీనామాలు సమర్పించగా అందులో తొమ్మిది ఫార్మెట్ ప్రకారం లేవని స్పీకర్ మంగళవారం ప్రకటించారు. బీజేపీ డబ్బులకు అమ్ముడుపోయిన 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్‌ను కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.