క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో వీఆర్‌ఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్/కొందుర్గు, జూలై 10: నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ వీఆర్‌వో పట్టుబడగా, కేశంపేట తహశీల్దార్‌ను కూడా అదుపులోకి తీసుకోనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. వ్యవసాయ పొలం ఆన్‌లైన్ చేసేందుకు సదరు వీఆర్‌ఓ అంతయ్యతో పాటు మండల తహశీల్దార్‌లు.. రూ.8లక్షలు డిమాండ్ చేసి, రూ.4లక్షలు రైతు మామిడిపల్లి భాస్కర్ నుంచి వీఆర్‌వో తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు తహశీల్దార్ కార్యాలయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయపల్లి గ్రామానికి చెందిన మామిడిపల్లి చెన్నయ్య అనే రైతుకు సంబంధించి సర్వే నెంబర్ 85/ఆలో మొత్తం 9ఎకరాల 7గుంటల భూమి ఉంది. జూన్ 18వ తేది వరకు వ్యవసాయ భూమి వివరాలు ఆన్‌లైన్‌లో ఉన్నప్పటికీ 24వ తేదిన ఆన్‌లైన్‌లో చూస్తే ఈ సర్వే నెంబర్‌కు సంబంధించి భూమి వివరాలను పూర్తిగా తొలగించారు. వీఆర్‌ఓ అంతయ్యను సంప్రదించగా ఎకరాకు లక్ష రూపాయల చొప్పున తొమ్మిది లక్షల రూపాయలు ఇస్తేనే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని చెప్పినట్లు, అంత డబ్బు తాము ఇచ్చుకోలేమని సదరు రైతు చెన్నయ్య కుమారుడు భాస్కర్ సూచించారు. వీఆర్‌వో చివరగా ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా మొదట విడతగా రూ.30వేలు ఇచ్చారని, రెండవ విడత రూ.4లక్షలు వీఆర్‌ఓకు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. డబ్బు తీసుకున్న మరుక్షణమే కేశంపేట తహశీల్దార్ లావణ్యకు వీఆర్‌ఓ అంతయ్య ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు ఏసీబీ డీఎస్పీ వివరించారు. ఈ సర్వే నెంబర్‌కు సంబంధించిన రికార్డులను షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయంతో పాటు కేశంపేట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో రికార్డులను తనిఖీలు చేశారు. వీఆర్‌ఓ అంతయ్యతో పాటు కేశంపేట తహశీల్దార్ లావణ్యను అదుపులోకి తీసుకొని గురువారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.