క్రైమ్/లీగల్

చెన్నమనేని పౌరసత్వంపై సత్వర నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దుకు సంబంధించి కేంద్రం మరో మారు సమీక్షించి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు సరిగా లేవని పేర్కొంటూ చెన్నమనేని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను మళ్లీ పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది.
ఈ అంశాన్ని మూడు నెలల్లో తేల్చాలని హైకోర్టు పేర్కొంది. చెన్నమనేని అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది.