క్రైమ్/లీగల్

డబ్బే..డబ్బు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ షాద్‌నగర్, జులై 11 లంచాలు లేని రెవెన్యూ అని సీఎం కేసీఆర్ ప్రకటించిన సమయంలోనే ఏకంగా 93లక్షల రూపాయలనోట్ల కట్టలతో దొరికిపోయిన కేశంపేట తహశీల్దార్ లావణ్యను పోలీసులు అరెస్టు చేశారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తున్నట్లు ప్రకటించిన రోజునే ఒక తహశీల్దార్, వీఆర్‌ఓను ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం, కళ్లుచెదిరిపోయే ఆస్తులు కనుగొనడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. హయత్‌నగర్‌లోని లావణ్య ఇంట్లో బుధవారం అర్థరాత్రి వరకూ తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు గురువారం ఉదయం అమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె భర్త వెంకటేశ్ నాయక్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అతడు జీహెచ్‌ఎంసీలో మున్సిపల్ పరిపాలనా విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. కొందుర్గు వీఆర్‌ఓ అనంతయ్య బుధవారంనాడు ఓ రైతు నుంచి లంచం
తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడంతో తహసీల్దార్ లావణ్య లంచావతారం బయటపడింది. లావణ్య ఆదేశాల మేరకే అనంతయ్య లంచం పిండేస్తున్నట్టు ఏసీబీ విచారణలో వెల్లడైంది. హయత్‌నగర్‌లోని ఆమె నివాసంలో సోదాలు చేయగా రూ.93.5 లక్షల నగదు దొరికింది. 40 తులాలకు పైగా బంగారంను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లావణ్య కార్‌ను సోదా చేయగా రైతులకు సంబంధించిన 11 పాస్ పుస్తకాలు లభ్యమయ్యాయి. అందులో నాలుగు పాస్ పుస్తకాలు 2018 సంవత్సరానికి సంబంధించినవి. మిగతావి కొత్తవే. రైతుల భూములకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేసేందుకు సంబంధించిన 45 దరఖాస్తులు తహశీల్దార్ కారులో లభించాయి. భూముల వివరాలు ఆప్‌లోడ్ చేయడానికి రైతుల నుంచి డబ్బులు తీసుకోడానికి ఉండవచ్చని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. లావణ్యను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో విచారణ పూర్తయిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను ఏసీబీ కార్యాలయానికి తీసుకువచ్చి, ఆ తరువాత బంజారాహిల్స్‌లవోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు.
కేశంపేట రెవెన్యూ ఆఫీసులో విలువైన ఫైళ్లు సీజ్
వ్యవసాయ భూమి విషయంలో కేశంపేట తహశీల్దార్ లావణ్య, వీఆర్‌ఓ అంతయ్య కలిసి రైతు నుండి ఏకంగా తొమ్మిది లక్షలు డిమాండ్ చేసి, ఎనిమిది లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కొందుర్గు తహశీల్దార్ కార్యాలయంలో రైతు కుమారుడు భాస్కర్ నుంచి నాలుగు లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రైతు నుండి డబ్బులు తీసుకున్న మరుక్షణమే వీఆర్‌ఓ కేశంపేట తహశీల్దార్ లావణ్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. అప్రమత్తమైన ఏసీబీ అధికారులు ఏకకాలంలో కొందుర్గు తహశీల్దార్ ఆఫీసుతోపాటు షాద్‌నగర్ ఆర్‌డీఓ కార్యాలయం, కేశంపేట తహశీల్దార్ ఆఫీసుల్లో దాడులు నిర్వహించారు. విలువైన రికార్డులను సీజ్ చేశారు. స్థానికంగా రెండు తహశీల్దార్ కార్యాలయాలతోపాటు షాద్‌నగర్ ఆర్‌డీఓ ఆఫీసులలో సోదాలు జరుపుతూ హయత్‌నగర్‌లోని లావణ్య ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో తహశీల్దార్ ఇంట్లో ఏకంగా 93లక్షల రూపాయల నగదు లభించడమే కాకుండా విలువైన డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు లభించాయి. ఒకవైపు ఏసీబీ అధికారులు హయత్‌నగర్‌లోని తహశీల్దార్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తునే, మరోవైపు కేశంపేట తహశీల్దార్ కార్యాలయంలో గురువారం తెల్లవారు జామున ఐదు గంటల వరకు రికార్డులను తనిఖీ చేశారు. విలువైన రికార్డులను సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వివరించారు. వీఆర్‌ఓతోపాటు తహశీల్దార్ లావణ్యను రిమాండ్‌కు తరలించారు. మండల స్థాయి తహశీల్దార్‌గా విధులు నిర్వహించిన లావణ్య ఇంట్లో ఇంతపెద్ద మొత్తంలో నగదు, బంగారం, ఆస్తిపత్రాలు లభించడంతో ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. లావణ్య ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలు లభించడంతో సోదాలు చేసిన ఏసీబీ అధికారుకు మతిపోయింది. లావణ్య, వీఆర్‌ఓ అవినీతి వ్యవహారం రెవెన్యూ శాఖలో అలజడి సృష్టించింది.

చిత్రాలు.. కేశంపేట రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు, పోలీసుల అదుపులో తహశీల్దార్ లావణ్య