క్రైమ్/లీగల్

అక్రమ వసూళ్ల కోసం తుపాకుల సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 11: అక్రమ వసూళ్లకు పాల్పడే వ్యక్తులకు తుపాకులు సరఫరా చేస్తున్న ముఠా వరంగల్ పోలీసులకు చిక్కింది. తుపాకితో బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడే ముఠాకు తుపాకులను సరఫరా చేసే ఆరుగురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్. దుగ్గొండి, గీసుకొండ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ముఠా సభ్యుల నుండి రెండు 9ఎంఎం రివాల్వర్లు, ఆరు బులెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు వరంగల్ సీపీ రవీందర్ గురువారం మీడియాకు వెల్లడించారు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం చలపర్తి గ్రామానికి చెందిన జన్నుకోటి, నర్సంపేట మండలానికి చెందిన ముడురుకోల్ల సంతోష్, ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ గ్రామానికి చెందిన అబ్బర్ల రాజయ్య, చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన మొగిలి ప్రతాప్‌రెడ్డి, గీసుకొండ మండలం కొమ్మాల గ్రామానికి చెందిన నిమ్మానికొండ మల్లిఖార్జున్, ములుగు జిల్లా బండారుపల్లి గ్రామానికి చెందిన వాయినాల రవి మొత్తం ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. ఈ ముఠా అరెస్ట్‌కు సంబంధించి వివరాలు వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ వెల్లడిస్తూ నిందితుల్లో ప్రధాన నిందితుడైన జన్ను కోటి న్యూడెమోక్రసీ పార్టీకి సానుభూతిపరుడిగా వ్యవహరిస్తుండగా మరో నిందితుడు వాయినాల రవి గతంలో ప్రజా ప్రతిఘటన పార్టీలో పనిచేశాడు. ఈ ఇద్దరు నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మరో నిందితుడు సంతోష్‌తో కలిసి ఉత్తరాది రాష్ట్రాల్లో తుపాకులను కొనుగోలు చేసి ఎక్కువ ధరకు వరంగల్ ప్రాంతంలో అమ్మేందుకు ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా గతంలో న్యూడెమోక్రసీ పార్టీలో పనిచేసిన మరో ఇద్దరు నిందితులు అబ్బర్ల రాజయ్య, మెగిలి ప్రతాప్‌రెడ్డిలు తుపాకీతో బెదిరించి డబ్బు వసూళ్లుకు పాల్పడేందుకు అవసరమైన తుపాకుల కోసం నిందితుల్లో ప్రధాన నిందితుడైన జన్ను కోటితో ఒప్పందం కుదుర్చుకోవడంతో నిందితులు కోటి, రవి, సంతోష్, మల్లిఖార్జున్‌లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక 9 ఎంఎం తుపాకితో పాటు రెండు బులెట్లను కొనుగోలు చేశారు. నిందితుల్లో ముగ్గురు కొనుగోలు చేసిన తుపాకి, బుల్లెట్లను రాజయ్య, ప్రతాప్‌రెడ్డిలకు అందజేసేందుకు గురువారం ఉదయం దుగ్గొండి మండలం గిర్నిబాయి ప్రాంతంలోని టేకు ప్లాంటేషన్‌కు వచ్చినట్టు వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ ఏసీపీ చక్రవర్తికి సమాచారం రావడంతో ఏసీపీ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్. రమేష్ కుమార్, యూనివర్సిటీ ఇన్‌స్పెక్టర్ డేవిడ్‌రాజ్, దుగ్గొండి ఎస్సై సాంబమూర్తి తమ సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుండి ఒక పిస్తోల్, రెండు రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మరో నిందితుడు మల్లిఖార్జున్‌ను అరెస్ట్ చేసి ఇతని నుండి ఒక తుపాకి, నాలుగు రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని సీపీ రవీందర్ వెల్లడించారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన ఈస్ట్ జోన్ డీసీపీ నాగరాజు, టాస్క్ఫోర్స్ ఏసీపీ చక్రవర్తి, ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్, నర్సంపేట ఇన్‌స్పెక్టర్ సతీష్‌బాబు, గీసుకొండ ఇన్‌స్పెక్టర్ సంజీవరావు, దుగ్గొండి ఎస్సై సాంబమూర్తి, టాస్క్ఫోర్స్ హెడ్‌కానిస్టేబుల్ శ్యాంసుందర్, శ్రీను, అలీలను సీపీ రవీందర్ అభినందించారు.
చిత్రం... స్వాధీనం చేసుకున్న పిస్తోళ్లు