క్రైమ్/లీగల్

కుంటలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, జూలై 12: తొలి ఏకాదశి పండగను సంబరంగా జరుపుకుంటున్న ఆ కుటుంబం విషాదంలో మునిగి పోయింది.. అంతదాకా తమ కళ్లముందే ఆడుకున్న కన్నకొడుకులిద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లారనే వార్త ఆ కుటుంబాన్ని కలచివేసింది.. కుంటలో దిగి నీట మునిగి కంటిపాపాల్లా పెంచుకుంటున్న తమ చంటిబిడ్డల మరణంతో పండుగ పూట ఆ ఇంటి దీపాలు ఆరిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని తిరుమలాపురం గ్రామంలో శుక్రవారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. పాఠశాలకు సెలవు కావడంతో తిరుమలాపురం మర్రి కుంట వైపు వెళ్ళిన చింతనూరి సూర్యతేజ (10), చింతనూరి విశాల్ (7) ఆడుకుంటూ వెళ్లి కుంటలో దిగారు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా తీసిన గోతిలోకి గురువారం రాత్రి కురిసిన వర్షానికి నీరు వచ్చి చేరింది. ఆడుకుంటూ నీటి వద్దకు వెళ్ళిన చిన్నారులు నీటమునిగి పోయారు. తమ పిల్లలిద్దరూ ఉదయం ఇంటినుంచి వెళ్లారని.. భోజనం వేళవుతున్నా ఇంకా ఇంటికి రాలేదని.. వారి తల్లిదండ్రులు చింతనూరి శ్రీను, హైమావతిలు ఊరంతా తిరగసాగారు. మధ్యాహ్నం సమయంలో పిల్లలిద్దరూ ఊరు పక్కనే ఉన్న కుంటవైపు వెళ్ళటం చూశామని స్థానికులు చెప్పడంతో వారు అక్కడికి వెళ్ళారు. కుంటలో నీటితో నిండి ఉన్న గోతి వద్ద పిల్లల కాళ్ళ అడుగులు కనిపించటంతో బోరుమన్నారు. స్థానిక యువకులు గోతిలోకి దిగి అప్పటికే మృతి చెంది నీటి అడుగునున్న ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. పండుగ వేళ గ్రామంలో చోటు చేసుకున్న విషాద సంఘటనతో ఊరంతా బోరున విలపించింది. తమ ఇద్దరు పిల్లలు మరణించటంతో తల్లిదండ్రులు గుంలవిసేలా విలపించారు. తొర్రూర్ మండలంలోని వెంకటాయపాలెం గ్రామానికి చెందిన శ్రీను, హైమావతి దంపతులు బతుకుదేరువు కోసం కొన్ని నెలల క్రితం తిరుమలాపురం వచ్చారు. స్థానికంగా ఉన్న వర్మీకంపోస్టు తయారి కేంద్రంలో పని చేస్తున్నారు. కన్నబిడ్డలను కష్టం లేకుండా పెంచాలని ఉన్న ఊరు వదలి ఇంతదూరం వస్తే తమ ఇద్దరు బిడ్డలను కుంట మింగేసిందంటూ వారు చేసిన రోదనలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దర చిన్నారులు మృతి చెందిన సంఘటన తెలుసుకొని ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, జడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అద్యక్షుడు తోట లాలయ్యలు తిరుమలాపురం వచ్చి చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చారు. కురవి ఎస్‌ఐ నాగభూషణం కేసు నమోదు చేసి శవపంచానామా జరిపి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
చిత్రం... కుంటలో పడి మృతి చెందిన చిన్నారులు సూర్యతేజ, విశాల్