క్రైమ్/లీగల్

రవిప్రకాశ్‌కు ముందస్తు బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : టీవీ -9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను శుక్రవారం నాడు హైకోర్టు మంజూరు చేసిం ది. ఫోర్జరీ , నిధుల మళ్లింపు కేసులో నిందితుడిగా ఉన్న రవిప్రకాశ్ పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భావనతో హైకోర్టులో క్వాష్ పిటిషన్‌తోపాటు ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వాటిపై గత కొద్ది రోజులుగా విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసిం ది. పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. వారానికి ఒకసారి పోలీసుల ముందు హాజరుకావాలని బెంచ్ స్పష్టం చేసింది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని రవిప్రకాశ్‌ను ఆదేశించింది. గతంలో రవిప్రకాశ్ రెండు మార్లు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, కేసు దర్యాప్తునకు తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండేలా చేయగలరని ఆయనకు బెయిల్ ఇవ్వవద్దని ప్రతివాదులు కోరారు. హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. ఒక దశలో బెయిల్ నిరాకరించడంతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకే వెళ్లాలని రవిప్రకాశ్‌కు సుప్రీంకోర్టు సూచించింది.