క్రైమ్/లీగల్

గంగిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, జూలై 12: మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న గంగిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. గంగిరెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు చేసేందుకు అనుమతివ్వాలని సిట్ అధికారులు గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌ను విచారించిన కోర్టు శుక్రవారం అనుమతిచ్చింది. పోలీసులు ఎప్పుడు పిలిచినా ఆ పరీక్షలు చేయించుకొనేందుకు వెళ్లాలని గంగిరెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది. వివేకా హత్యకు సంబంధించి సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంతో గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. మూడునెలలు అయినా పోలీసులు ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో ముగ్గురు బెయిల్‌పై బయటకు వచ్చారు. సరైన సాక్ష్యాధారాలు లభించకపోవడంతో అనుమానితులకు పోలీసులు నార్కో అనాలసిస్ పరీక్షలు చేసేందుకు కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే వాచ్‌మెన్ రంగయ్య, దిద్దికుంట శేఖర్‌రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతిచ్చింది. తాజాగా గంగిరెడ్డికి కూడా అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ శుక్రవారం తన కార్యాలయంలో గంగిరెడ్డిని విచారించారు. కాగా గంగిరెడ్డిని పరీక్షల నిమిత్తం శనివారం హైదరాబాద్‌కు పోలీసులు తీసుకెళ్లనున్నట్లు సమాచారం.