క్రైమ్/లీగల్

మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో బంజారాహిల్స్ పోలీస్టేషన్‌లో రేవతిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. శుక్రవారం మణికొండలోని ఆమె నివాసం వద్ద పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్టేషన్‌కు తీసుకువచ్చారు. కేసు విచారణలో భాగంగా పోలీస్టేషన్‌కు వచ్చేందుకు ఆమె నిరాకరించడంతో ఇంటికి వెళ్లి అరెస్టు చేసిన్నట్లు పోలీసులు వెల్లడించారు. టీవీ చర్చా కార్యక్రమంలో దళితులను కించపరిచే విధంగా మాట్లాడారని ఆమె ఫిర్యాదు చేశారు. దళిత సంఘ కార్యకర్త అమారే వరప్రసాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవతిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
రేవతి అరెస్టుపై హైకోర్టుకు..
మోజో టీవీ సీఈఓ రేవతి అరెస్టుపై ఆమె భర్త చైతన్య హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసుపై తన భార్య రేవతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన తీరు చాలా దారుణమని ఆయన పేర్కొన్నారు. గతంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు తాము స్పందించామని, అవసరం అనుకుంటే తామే విచారణకు పిలుస్తామని పోలీసులు చెప్పారని అన్నారు. అయితే శుక్రవారం నాడు అకస్మాత్తుగా పోలీసులు ఇంట్లో ప్రవేశించి రేవతిని బలవంతగా ఈడ్చుకువెళ్లారని ఆయన ఆరోపించారు. తన మొబైల్‌ను లాక్కున్నారని, పోలీసుల విచారణకు ఆమె సహకరిస్తోందని అన్నారు. రేవతి అరెస్టుపై ఆమె తరఫున న్యాయవాది ఉమేష్‌చంద్ర హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం తాము బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నామని అన్నారు.