క్రైమ్/లీగల్

నా తప్పేమీ లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్: పరువు నష్టం దావా కేసును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి శుక్రవారం అహ్మదాబాద్‌లోని మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీపై అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు క్రిమినల్ పరువు నష్టం దావా కేసు దాఖలు చేసింది. ఈ బ్యాంకు చైర్మన్‌గా అజయ్ పాటిల్ కాగా డైరెక్టర్‌గా కేంద్ర హోం మంత్రి అమిత్ షా డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే 2016వ సంవత్సరం నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ బ్యాంకు డైరెక్టర్‌గా అమిత్ షా ఉన్నందున బ్యాంకుకు సంబంధించిన 750 కోట్ల రూపాయల రద్దయిన నోట్ల స్థానే కొత్త నోట్లను కేవలం ఐదు రోజుల్లో తీసుకున్నట్లు రాహుల్ ఆరోపించారు. నోట్ల రద్దుతో పేద ప్రజలు తీవ్ర కష్టాలు అనుభవిస్తున్న సమయంలో బ్యాంకు చాలా తేలిగ్గా నోట్లను మార్పిడి చేసుకున్నదని, ఇదో పెద్ద కుంభకోణం అని రాహుల్ లోగడ ఆరోపించారు. దీంతో రాహుల్‌పై ఆ బ్యాంకు పరువు నష్టం దావా కేసు దాఖలు చేసింది. శుక్రవారం కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో తన క్లయింట్ రాహుల్ తప్పేమి లేదని ఆయన తరఫు న్యాయవాది వాదన వినిపించారు. రాహుల్ తరఫు న్యాయవాది బెయిల్ కావాలని కోరడంతో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎన్‌బీ మునీష్ బెయిల్ మంజూరు చేశారు. నోట్ల రద్దు తర్వాత రాహుల్ గాంధీ అమిత్ షానుద్ధేశించి మీరు డైరెక్టర్‌గా ఉన్న బ్యాంకు ఐదు రోజుల్లోనే 750 కోట్ల రూపాయలను కొత్త నోట్లుగా మార్పిడి చేసుకున్నందుకు శుభాకాంక్షలు చెబుతున్నానని, మీ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నందుకు శెల్యూట్ చేస్తున్నానంటూ అప్పట్లోనే ట్వీట్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న బ్యాంకు యజమాన్యం పరువు నష్టం దావా కేసు దాఖలు చేసింది. ఇలాఉండగా మరో కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు రాహుల్ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీ దాఖలు చేసిన కేసుకు తాను హాజరు కావాల్సి ఉందని, వీటితో సిద్ధాంతపరమైన యుద్ధం చేసే అవకాశం తనకు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, సత్యమేవ జయతే అనేది ప్రజలకు నిరూపితమవుతుందని రాహుల్ ట్వీట్ చేశారు.
ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు..
కేంద్రంలో అధికార బీజేపీ ధన బలంతో, బెదిరింపులతో ప్రభుత్వాలను కూల్చి వేస్తున్నదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం కర్నాటకలో జరుగుతున్నది ఇదేనని ఇక్కడ మీడియాతో మాట్లాడిన సందర్భంగా అన్నారు. అవకాశం ఉన్న అన్ని చోట్ల బీజేపీ ఇలాంటి చర్యలకే పాల్పడుతున్నదని మొదటి సారి గోవాలో, ఇప్పుడు కర్నాటకలో ప్రభుత్వాల కూల్చివేతకు ఒడిగడుతోందని రాహుల్ విమర్శించారు. బీజేపీకి డబ్బు, అధికారం ఉన్నాయని, వాటిని వీటి కోసం ఉపయోగిస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. న్యాయం, ధర్మం కోసం కాంగ్రెస్ పాటుపడుతున్నదని, దాని వల్లే మరింత బలోపేతం అవుతున్నదని ఆయన పేర్కొన్నారు.