క్రైమ్/లీగల్

భారత్‌పై ఉగ్ర దాడి కుట్ర భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 13: భారత్‌లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతున్న ఓ ముఠాను జాతీయ దర్యాప్తు ఏజెన్సీ అధికారులు శనివారం మట్టుబెట్టారు. తమ లక్ష్యాల సాధన కోసం నిధులు సేకరిస్తున్న ఈ సంస్థ సభ్యులు ఉగ్రవాద దాడులకు పన్నాగం పన్నుతున్నట్లుగా వెల్లడైందని అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నాగపట్నం, చెన్నై ప్రాంతాల్లో ఈ ముఠా సభ్యుల ఇళ్ళపై అధికారులు దాడులు జరిపారు. నిందితులందరు కూడా భారత్‌పై ఉగ్రవాద దాడికి కుట్ర పన్నుతున్నట్లుగా విశ్వసనీయంగా వెల్లడైందని అధికారులు తెలిపారు. భారత్‌లో అన్సారుల్లా అనే ఉగ్రవాద ముఠాను స్థాపించేందుకు వీరు చేస్తున్న కుట్ర ను భగ్నం చేశామన్నారు. ఇప్పటివరకు ఈ ముఠా భారీ ఎత్తున నిధులు సేకరించినట్లుగా స్పష్టమవుతోందన్నారు. సయ్యద్ బుకారీ, హసన్ అలీ, మహ్మద్ యాసుఫుద్దీన్‌లపై భారత శిక్షాస్మృతిలోని అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సోదాల్లో 9 మొబైల్ ఫోన్లు, 15 సిమ్ కార్డులు, ఏడు మె మోరీ కార్డులు, మూడు ల్యాబ్ ట్యాబ్‌లు, ఆరు పెన్ డ్రైవలతో సహా అనేక కీలక పత్రాలు స్వాధీనం అయినట్లు తెలిపారు.