క్రైమ్/లీగల్

వ్యాధుల నివారణకు చర్యలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వాతావరణంలో మార్పు, వర్షాకాలం మొదలు కావడంతో ప్రబలే వ్యాధుల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణ రూపొందించిందో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికను కోర్టు ముందుంచాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ , జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన ప్రజావాజ్య పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. స్వైన్‌ఫ్లూ, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని, వాటి నివారణకు అవసరమైన మందులను, ఇతర సౌకర్యాలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిద్ధంగా ఉంచాలని పిటీషనర్ పేర్కొన్నారు. వ్యాధులు సోకిన వారు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తుంటే అక్కడ సౌకర్యాలు లేక వారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని, అక్కడ పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారని రాపోలు పేర్కొన్నారు. పిల్‌ను స్వీకరించిన హైకోర్టు ఈ వ్యవహారం చూడటానికి కోర్టు సహాయకుడ్ని కూడా నియమించింది. కోర్టు సహాయకుడు అందజేసిన నివేదికలోని అంశాలను ప్రభుత్వం గుర్తించి వాటిని అమలుచేయడం ద్వారా వ్యాధులను నివారించాలని సూచించిం ది. స్వైన్‌ఫ్లూ వస్తే దానిని నిర్ధారించేందుకు రెండు మాత్రమే ల్యాబ్‌లున్నాయని, వాటిని కనీసం 8కు పెంచాలని కోర్టు పేర్కొంది. ఆగస్టు 1లోగా ప్రభుత్వం తమ నివేదికను అందించాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసింది.
గొర్రెల పంపిణీ అక్రమాలపై పిటిషన్
వాచ్ వోయిస్ ఎన్‌జీవో రాష్ట్రంలో గొర్రెల పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై ప్రజా వాజ్య పిటీషన్‌ను హైకోర్టులో దాఖలు చేసింది. గ్రామీణ ఆర్థిక స్థితి గతులను మెరుగుపరిచేందుకు ఉద్ధేశించిన ఈ పథకం పక్కదారిపడుతోందని, ఈమొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు న్యాయస్థానం ఆదేశించాలని కోరుతూ పిల్ దాఖలుచేసింది. రాష్ట్రంలో 3,19,477 యూనిట్లు గొర్రెలు పంపిణీ చేయగా, అందులో 10 శాతం కూడా లేవని ఆ పిటీషన్‌లో పేర్కొన్నారు. సీబీఐకి ఈ కేసు అప్పగిస్తే అనేక వాస్తవాలు వెలుగు చూస్తాయని పిటీషన్‌లో పేర్కొన్నారు.