క్రైమ్/లీగల్
బంజారాహిల్స్ పీఎస్‌లో యాంకర్ శే్వతారెడ్డి ఫిర్యాదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, జూలై 13: బంజారాహిల్స్ పోలీస్టేషన్‌లో యాంకర్ శే్వతారెడ్డి ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్-3లో తనను సెలెక్ట్ చేసినప్పటికీ ఇప్పటీ వరకు నిర్వహకులు అగ్రిమెంట్ ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. బిగ్‌బాస్‌లో చేయాలంటే బాస్‌ని ఇంప్రెస్ చేయాలని, ఆర్గనైజర్స్ అసభ్యంగా మాట్లాడారని విమర్శించారు. ప్రోగ్రామ్ ఇన్‌ఛార్జ్ శ్యామ్, రఘు తనను మోసం చేశారని, తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని శే్వతారెడ్డి తెలిపారు. బిగ్‌బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందని శే్వతారెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఉత్తరాది గబ్బు సంస్కృతిని తెలుగువాళ్లపై రుద్దాలని అనుకుంటున్నారా, తెలుగువాళ్లపై తప్పుడు కల్చర్ రుద్దుతామంటే ఊరుకోం, బిగ్‌బాస్-3ని నిషేధించాలని అమె డిమాండ్ చేసింది. తెలుగు టీవీ నుంచి వెలివేయాలి, బిగ్‌బాస్ వల్ల ఎవరూ బాగుపడలేదు, బిగ్‌బాస్ ముసుగులో నిర్వాహకులు బ్రోతల్ హౌస్ నడుపుతున్నారా అని నిర్వహకులపై శే్వతారెడ్డి ఆరోపించింది.