క్రైమ్/లీగల్

లోక్ అదాలత్‌లో 29,027 కేసుల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 29,027 కేసులను పరిష్కరించామని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తెలిపింది. అథారిటీ మెంబర్ సెక్రటరీ ఏ. సంతోష్‌రెడ్డి పేరుతో శనివారం పత్రికా ప్రకటన జారీ అయింది. పరిష్కారం అయిన కేసుల్లో 16,793 కేసులు ప్రీ-లిటిగేషన్ కేసులని, 12,234 కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులని వివరించారు. ఈ సందర్భంగా 40.73 కోట్ల రూపాయలు పరిహారంగా బాధితులకు ఇప్పించామన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్. చౌహాన్, అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పి.వి. సంజయ్ కుమార్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ ఏ. రాజశేఖరరెడ్డిల సమన్వయంతో లోక్ అదాలత్ నిర్వహించామన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని కోర్టుల్లో 27 చోట్ల లోక్ అదాలత్‌లు నిర్వహించినట్టు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎన్. తుకారాంజీ తెలిపారు. మొత్తం 11,467 కేసులను పరిష్కరించామని వివరించారు.