క్రైమ్/లీగల్

ఇన్‌స్పెక్టర్ సహా ఆరుగురు పోలీసుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూలై 14: దళిత మహిళలపై గ్యాంగ్‌రేప్‌తో పాటు కస్టడీలో వ్యక్తి మృతికి కారణమైన కేసులో ఆరుగురు పోలీసులతో పాటు ఇన్‌స్పెక్టర్ ను సస్పెండ్ చేసిన వైనం రాజస్థాన్‌లోని చురు జిల్లాలో చోటు చేసుకొంది. గ్యాంగ్ రేప్‌కు గురైన దళిత జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దళిత మహిళ మరిది నేమిచంద్ పోలీసు కస్టడీలో మరణించాడు. దళిత మహిళ శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్దార్‌షహర్ ఆరుగురు పోలీసులను ఎస్‌సెచ్‌వోను ఆదివారం సస్పెండ్ చేశారు. ఈ కేసును సీబీసీఐడి అధికారు లు విచారించనున్నట్లు నేమిచంద్ మరణం అనంతరం సర్దార్‌షహర్ ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు స్వీకరిస్తున్న మహేంద్రదత్ ఆదివారం తెలిపారు. ఆరుగురు పోలీసులు, ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదైం ది. చోరీ కేసులో జూలై 6న ఉదయం నేమిచంద్ (22)ను అరెస్టు చేయగా అదే రోజు రా త్రి అతను ఆసుపత్రిలో మరణించాడు. జూన్ 30న తన సోదరుడు నేమిచంద్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని దళిత మహిళ భర్త, నేమిచంద్ సోదరుడు ఆరోపించారు. జూలై 3న పోలీసులు నేమిచంద్‌ను తన ఇంటికి తీసుకొచ్చి ఆ వెంటనే తన భార్యను కూడా స్టేషన్‌కు తీసుకెళ్లారని అతను పేర్కొన్నాడు. అదేరోజు తన సోదరుడిని దారుణంగా చితకబా ది.. హింసించారనీ.. అ లాగే తన భార్యను సైతం తీవ్రంగా కొట్టి గోళ్లను పీకి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారని వాపోయాడు. పోలీసు కస్టడీలోనే తన సోదరుడు మరణించాడనడానికి తన భార్యే ప్రత్యక్ష సాక్షి అని ఆరోపించా డు. పైగా విషయం బయటకు పొక్కకుండా ఉం డేందుకు అదే రోజు రాత్రి తన సోదరుడు నేమిచంద్ అంత్యక్రియలను పూర్తి చేశారని ఆరోపించాడు. ఎస్‌హెచ్‌వో రన్‌వీర్‌సింగ్ మరో ఆరుగురు పోలీసులు ఈ దారుణాలకు పాల్పడ్డారని ఆరోపించాడు. ఈ రెండు ఉదంతాలకు సంబంధించి ఐపీ సీ సెక్షన్ 376-డీ (గ్యాంగ్‌రేప్), 343 (నిబంధనలకు విరుద్ధంగా మూడురోజులకు పైగా నిర్బంధంలో ఉంచడం), ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద ఆరుగురు పోలీసులు, ఎస్‌హెచ్‌వోలను సస్పెండ్ చేయడంతో పాటు కేసు నమోదు చేసి సీబీసీఐడీకి అప్పగించారు.