క్రైమ్/లీగల్

కలెక్టరేట్ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల: తమ పేరుపైన ఉన్న భూమిని కొందరు దొంగపట్టా చేయించుకున్నారని పట్టా రద్దు చేసి తమ పట్టా ఇప్పించాలని బాధితుడు కలెక్టరేట్ ముందు ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం సంచలంన సృష్టించింది. సోమవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కొంచెవెల్లి గ్రామానికి చెందిన నికాడి మహేష్ తన కుటుంబ సభ్యులతో వచ్చి కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగి కిరోసిన్ పోసుకోవడంతో పాటు పురుగుల మందు తాగేందుకు యత్నించగా కలెక్టరేట్ సెక్రటరియేట్ పోలీసులు అడ్డుకున్నారు.
రైతు కుటుంబం ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరో వైపు పోలీసులు అరెస్టు చేసి ఆత్మహత్యా యత్నం కేసు నమోదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కొంచెవెల్లి గ్రామానికి చెందిన నికాడి రాజుమేర (63) తండ్రి చిన్నుమేరకు మంచిర్యాల జిల్లా కనె్నపెల్లి మండలం నాగిపల్లి శివారులోని సర్వే నెంబర్ 49/4లో 4 ఎకరాల సీలింగ్ భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. 40 ఏళ్ల కిందట ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూమిని అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు అధికారుల అండతో నికాడి రాజు మేర, తండ్రి కిష్టుమేర అనే వ్యక్తి ఆ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరి పేర్లు, ఇంటి పేర్లు ఒకటే కాగా, తండ్రుల పేర్లు వేర్వేరు కావడంతో రాజుమేర తండ్రి కిష్టుమేరగా పేరు మార్చుకున్నాడు. ఈ మేరకు పాత పహాణీల్లో రెవెన్యూ అధికారులు తండ్రి మార్చినట్టు సృష్టించినట్లు తెలుస్తోందని బాధితులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై గత సంవత్సరం ఎన్నోసార్లు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా అక్రమంగా పట్టా చేసుకున్న వ్యక్తికే వత్తాసు పలుకుతూ తమను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ బాధితులు ఆరోపించారు. ఆ భూమిలోకి వెళితే అసలు పట్టాదారునైన తనపైనే కేసు పెడతతానని ఎస్సై బెదిరించాడని రాజుమేర ఆరోపించారు. కలెక్టర్, సబ్‌కలెక్టర్, తహశీల్దార్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరుగలేదన్నారు. అక్రమ పట్టాలు రద్దు చేసి తమ పేరిట పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని కోరారు. తమకు సదరు భూమి మినహా వేరే ఆధారం లేదని, పట్టా ఇవ్వని పక్షంలో కుటుంబ సభ్యులం అందరం కలెక్టరేట్ ముందు ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు. విషయం తెలుసుకున్న డిఆర్‌ఓ రాజుమేర కుటుంబ సభ్యులను తన చాంబర్‌లోకి పిలిపించుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కనె్నపెల్లి తహశీల్దార్‌తో ఈ విషయంపై ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం భూమి వద్దకు వెళ్ళి విచారణ జరిపి రాజుమేరకు న్యాయం చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యా యత్నం చేసుకున్నందుకు రాజుమేర కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. వారిపై ఆత్మహత్యా యత్నం కేసు నమోదు చేశారు.

చిత్రం... ఆత్మహత్యా యత్నం చేస్తున్న బాధితులను తీసుకెళుతున్న పోలీసులు