క్రైమ్/లీగల్

మురళీధరరావు మోసం చేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధరరావు సహా ఎనిమిది మంది తనను మోసం చేశారని, దీనిపై తాము పెట్టిన కేసు దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని పేర్కొంటూ టీ. ప్రవర్ణారెడ్డి అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తామని మూడు కోట్ల రూపాయిలను తీసుకుని మురళీధరరావు, పీఎ కృష్ణకిశోర్, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) సలహాదారు ఎం రామచంద్రారెడ్డి లు మోసం చేశారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ రాజశేఖర్ రెడ్డి పోలీసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించగా.. నాలుగు వారాల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున న్యాయవాది జీ. మల్లారెడ్డి హైకోర్టుకు తెలిపారు. ప్రవర్ణారెడ్డి ఫిర్యాదు మేరకు గత మార్చిలోనే సరూర్‌నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే తన పిటిషన్‌పై పోలీసులు స్పందించడం లేదని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రవర్ణారెడ్డి పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతోందని పోలీసులను ప్రశ్నించింది. నాలుగు వారాల్లో నిందితులపై చార్జిషీట్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలు వాయిదా వేసింది.
అప్పీలు చేసుకునే అధికారం పవర్ కంపెనీలకు ఉంది: సుప్రీం
తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగుల పంపకాలకు సంబంధించి జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్ వేసిన తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల తరఫున న్యాయవాది మాట్లాడుతూ కేవలం 1157 మంది ఉద్యోగుల కేటాయింపుల్లో సమస్య ఉంటే జస్టిస్ ధర్మాధికారి కమిటీ మాత్రం మొత్తం 10,400 మంది ఉద్యోగుల ఆప్షన్లు కోరిందని పేర్కొన్నారు. అందరికీ ఆప్షన్లు ఇచ్చిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ సమస్యను మరింత క్లిష్టంగా మార్చిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జస్టిస్ అరుణమిశ్రా ధర్మాసనం తుది కేటాయింపులు జరిగాక దానిపై సవాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తుది కేటాయింపులపై సవాలు చేసుకునే స్వతంత్రతను కూడా పిటిషనర్లకే సుప్రీం ఇచ్చింది.