క్రైమ్/లీగల్

బిగ్‌బాస్ కాస్టింగ్ కౌచ్‌పై క్వాష్ పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగులో రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో సీజన్లోకి అడుగుపెడుతున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్’కు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. షో ప్రసారం కాకముందే వివాదాలు చుట్టుముట్టాయి. బిగ్‌బాస్‌లో కాస్టింగ్ కౌచ్ అనుమానాలున్నాయని ఒక పిటిషన్, ఇప్పటికే వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఇంకో పక్క బిగ్‌బాస్ ఇంటర్వ్యూల తీరుపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
ఇప్పటికే షో నిర్వాహకులపై యాంకర్, జర్నలిస్టు శే్వతారెడ్డి, నటి గాయత్రీ గుప్త హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ రియాల్టీ షోపై మరో పిటీషన్ దాఖలైంది. షో హోస్టు చేస్తున్న నాగార్జున సహా పది మందిని ప్రతివాదులుగా చేరుస్తూ కేతిరెడ్డి జగదీష్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని, హోం శాఖ ముఖ్యకార్యదర్శిని, డీజీపీ, పోలీసు కమిషనర్, జిల్లా కలెక్టర్, సెన్సార్ బోర్డును, స్టార్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ను, బీసీసీసీని, ఎండీమోల్ ఇండియాను, అన్నపూర్ణ స్టుడియోస్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ షోలో అభ్యంతరకర సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని అందుకే సినిమాలాగే ప్రతి ఎపిసోడ్‌ను సెన్సార్ చేసిన తర్వాతనే ప్రసారం చేయాలని పిటీషనర్ పేర్కొన్నారు. అన్యాయాన్ని, అనైతికతను ప్రోత్సహించేదిగా ఉందని, పిల్లలను తప్పుదారిపట్టిస్తోందని, అక్రమసంబంధాలను ప్రోత్సహించేదిగా ఉందని పిటీషన్‌లో వివరించారు. అంతేగాక రాత్రి 11 గంటల తర్వాతనే ఈ షోను ప్రసారం చేయాలని కోరారు.
హైకోర్టును ఆశ్రయించిన బిగ్‌బాస్ టీం
బిగ్‌బాస్ కో ఆర్డినేషన్ టీం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ షోపై నమోదైన కేసులను కొట్టి వేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటీషన్‌ను దాఖలు చేసింది. బిగ్‌బాస్ 3పై బంజారాహిల్స్, రాయదుర్గం పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను వెంటనే కొట్టివేయాలని పిటీషన్‌లో పేర్కొంది. కాగా బిగ్‌బాస్ టీం దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌ను అనుమతించొద్దంటూ జర్నలిస్టు శే్వతారెడ్డి, నటి గాయత్రీ గుప్తలు హైకోర్టు వద్ద నిరసనకు దిగారు.
సీలింగ్ భూముల లెక్క చెప్పండి: హైకోర్టు
రాష్ట్రంలో ఉన్న సీలింగ్ భూముల లెక్క చెప్పాలని హైకోర్టు మంగళవారం నాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మేడ్చెల్ జిల్లా కీసర దయారా గ్రామంలో ప్రభుత్వానికి అప్పగించిన 210 ఎకరాల మిగులు భూమి కాపాడకపోవడంతో అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉందని పేర్కొంటూ రాగి రాజరేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన జస్టిస్ పీ నవీన్‌రావు ఈ మేరకు ఆదేశాలు ఇస్తూ మిగులు భూమి లెక్కలు చెప్పాలన్నారు.