క్రైమ్/లీగల్

మూడు నెలల్లోగా మూసేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ప్రజారోగ్య వ్యయంతో ఆర్థికాభివృద్ధి జరగదని, ఈ నేపథ్యంలో దేశంలో ‘కఠినమైన కాలుష్యం’, ‘తీవ్ర కాలుష్యం’ వెదజల్లడానికి కారణభూతమవుతున్న పరిశ్రమలను మూడు నెలల్లోగా మూసివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ)ని ఆదేశించింది. సీపీసీబీ, ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డులు 2009-10లో సంయుక్తంగా పరిశోధన చేసిన తర్వాత పారిశ్రామికవాడలను పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ (పీఐఏ)లుగా గుర్తించి, ‘క్రిటికల్లీ పొల్యూటెడ్ ఏరియా’ (సీపీఏ), సివియర్లీ పొల్యూటెడ్ ఏరియా (ఓపీఏ)లుగా విభజించారు. గత ఐదేళ్లుగా కాలుష్యాన్ని వెదజలుతున్న పరిశ్రమల నుంచి కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆయా రాష్ట్రాల్లోని కాలుష్య నియంత్రణ బోర్డులు సమన్వయ సహకారంతో నిబంధనల మేరకు నష్టపరిహారం వసూలు చేయాలని ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ అధ్యక్షతన గల బెంచ్ ఆదేశించింది. ఆయా పరిశ్రమలు ప్రజారోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు వాతావరణాన్ని కలుషితం చేస్తున్న అంశాలను దృష్టిలో ఉంచుకుని తగిన నష్టపరిహారాన్ని వసూలు చేయాలని సూచించింది. వాతావరణ నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించని ప్రాంతాలు, ‘ఎరుపు’ ‘నారింజ’ విభాగాలుగా గుర్తించిన ప్రాంతాల్లో పరిశ్రమల కార్యకలాపాలు జరగకుండా లేదా ఉన్న పరిశ్రమలను విస్తరించకుండా అదేవిధంగా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారం కలిగించవద్దని సూచించింది. ‘తెలుపు’ లేదా ‘పచ్చ’ లేదా కాలుష్యాన్ని వెదజల్లబోమని స్పష్టం చేస్తూ అందుకు అనుగుణంగా పనిచేస్తున్న పరిశ్రమలకు సరికొత్త నిబంధనలు వర్తించవని బెంచ్ స్పష్టం చేసింది. వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్న పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో నీరు, గాలిలో వాతావరణ కాలుష్యం ఎంతమేరకు ఉందో సంబంధిత నిపుణులతో సమగ్ర వివరాలు మూడు నెలల్లోగా సేకరించాలని, దీనిని ప్రజలందరికీ తెలియజేయాలని బెంచ్ సూచించింది. అదేవిధంగా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సైతం ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు చేపట్టాలని ఎన్‌జీటీ చైర్‌పర్సన్ ఆదర్శ్ కుమార్ అధ్యక్షతన గల ఎన్‌జీటీ బెంచ్ ఆదేశించింది.