క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూలై 16: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మైలవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మర్సుమల్లి శివారు ములకలపెంట గ్రామానికి చెందిన రామినేని కృష్ణ (50) అనే వికలాంగుడు తన మూడు చక్రాల వాహనంపై తన తండ్రి శ్రీమన్నారాయణ (75)ను ఎక్కించుకుని మైలవరంలోని బ్యాంకుకు బయలుదేరాడు. చండ్రగూడెం బైపాస్ రోడ్డు వద్ద రాంగు రూటులో వచ్చిన టాటా ఏస్ వాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. వీరి వాహనం ధ్వంసం కాగా వీరిద్దరూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. 108 అంబులెన్సు సిబ్బంది అక్కడకు చేరుకుని ఇద్దరూ చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మైలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతిచెండటంతో ములకలపెంట గ్రామంలో విషాదం అలుముకుంది. వీరి కుటుంబం ఇబ్రహీంపట్నంలోని కిలేశపురం నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. పామాయిల్, జామాయిల్, మామిడి తోటలు సాగు చేస్తూ వీరు జీవిస్తున్నారు. రుణం తీర్చడానికి వీరు మైలవరం వెళ్తూ మృతి చెందారు. అమరావతి దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు వనమా బాబూరావు, నాగరాజు, వెంకటేశ్, నాగూర్ మీరా, రఘు తదితరులు, భౌతిక కాయాలను సందర్శించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వీరి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
పైపుల రోడ్డులో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు
* రికార్డులు లేని వాహనాలకు జరిమానాలు
పాయకాపురం, జూలై 16: రికార్డులు లేని వాహనాల పట్ల ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ సీఐ కాకురు బాలరాజు ఆధ్వర్యంలో అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతంలోని పలుచోట్ల మంగళవారం ఉదయం పోలీసులు ద్విచక్ర వాహనాల్ని తనిఖీ చేశారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి కౌనె్సలింగ్ ఇచ్చారు. హెల్మెట్ లేనపుడు జరిగే ప్రమాదాలు ఎలాంటి విపరిణామాలకు దారితీస్తాయో సీఐ బాలరాజు వివరించారు. పలువురు యువకులు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పోలీసులకు దొరికారు. వారి నుండి వాహనాలు స్వాధీనం చేసుకుని తల్లిదండ్రుల్ని తీసుకురమ్మని పంపించారు. లైసెన్సులు లేకుండా పిల్లలకు వాహనాల్ని కొనివ్వడం వల్ల వారు అవగాహన లేకుండా డ్రైవింగ్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పారు. మితిమీరిన వేగంగా నడిపి ప్రాణాలు కోల్పోతున్నారని, ఈవిధంగా వాహనాలు నడిపే వారి తల్లిదండ్రులకు ముందుగా కౌనె్సలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పలువురు మహిళలు సైతం హెల్మెట్ లేకుండా వాహనాలు నడపటంతో అలా చేయొద్దని సూచించారు. పైపుల రోడ్డు సర్కిల్ దగ్గర భారీగా వాహనాల్ని తనిఖీ చేశారు.