క్రైమ్/లీగల్

వ్యాపారి హత్యకేసులో మరో నలుగురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూలై 16: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వ్యాపారి రాంప్రసాద్ హత్యకేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 6న పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో రాంప్రసాద్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వ్యాపార లావాదేవీల్లో ఏర్పడ్డ వివాదంతో కే.సత్యనారాయణకు మృతుడు రాంప్రసాద్ మధ్య శత్రుత్వం ఏర్పడింది. పగతో రగిలిపోయిన సత్యనారాయణ కత్తులతో రాంప్రసాద్‌పై దాడి చేయించి దారుణంగా హత్య చేయించారు. భార్య వైదేహి తన భర్త హత్యకు సత్యమే కారణం అంటూ ఫిర్యాదు పేర్కొంది. కేసు నమోదు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ప్రసార మాధ్యమాలలో తనకు హత్యకు ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటనలు రాగాసాయి. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారించగా తామే హత్యచేసినట్టు ఒప్పుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆనంద్, విజయవాడకు ఆటోడ్రైవర్లు రమేష్, నరేష్‌లతో పాటు అజారుద్ధీన్ అలియస్ అజ్జులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏ6గా ఉన్న తిరుపతి సురేష్, ఏ11గా ఉన్న వెంకటరామి రెడ్డి పరారీలో ఉన్నట్టు వారిని సైతం త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.