క్రైమ్/లీగల్

వివాహితపై లైంగిక వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయదుర్గం, జూలై 16: ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వివాహితను మభ్యపెట్టి మాయచేసి ఏడాది పాటు శారీరకంగా అనుభవించిన ఓ ప్రబుద్ధుడు వీడియోలు తీసి బెదిరించి ఆనక తన ముగ్గురు స్నేహితులకు ఆమెను ఎరగావేశాడు. ఏడాదిపాటు ఈ కీచకుల చేతిలో చిత్రవధకు గురైన బాధితురాలు కుటుంబసభ్యుల సహకారంతో పోలీసులను ఆశ్రయించింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంగళవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సీఐ రజాక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయదుర్గం పట్టణానికి చెందిన పవన్ పాలకోసం తన వద్దకు రోజూ వచ్చే వివాహితతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. అది వారిద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. ఈ దృశ్యాలను వీడియో తీసిన పవన్ ఆమెను బెదిరించి తన స్నేహితులు మహేష్, చీటి మల్లికార్జున, ఫరూక్‌కు అప్పగించాడు. నలుగురు కలిసి ఏడాది పాటు ఆమెను లైంగికంగా వేధించారు. దీంతో విసిగిపోయిన ఆమె ఓసారి ఆత్మహత్యాయత్నానికి సైతం పాల్పడింది. వేధింపులు ఎక్కువకావడంతో కుటుంబసభ్యులకు జరిగిన ఘోరాన్ని చెప్పడంతో వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. బాధితురాలిని విచారించిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రజాక్ తెలిపారు.