క్రైమ్/లీగల్

నకిలీ పత్రాలతో రెండు మూడు పాస్‌పోర్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: నకిలీ పత్రాలతో రెండు, మూడు పాస్‌పోర్టులు పొందిన ముగ్గురిని టాస్క్ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. పేర్లు మార్చుకుని రెండు, మూడు పాస్‌పోర్టులు తీసుకున్న వీరి నుంచి ఏడు పాస్‌పోర్టులు, ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, స్కూల్ సర్ట్ఫికెట్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నగర టాస్క్ఫోర్స్ డిసిపి పి.రాధాకిషన్‌రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒకటో నిందితుడు హైదర్ అలీ లలానీ, రెండో నిందితుడు భందకాడ నరసింగరావు, మూడో నిందితుడు మహ్మద్ అబ్దుల్ సలాంలు నకిలీ పత్రాలతో పాస్‌పోర్టులు తీసుకున్నారు. హైదర్ అలీ లలానీ లలానీ హైదర్ అలీ, వెంకట్‌శర్మ పేర్లతో పాస్‌పోర్టులు పొందాడు. రెండో నిందితుడు భందకాడ నరసింగరావు బాలా నరసింగ రావు, బెన్నీ నరసింగరావు, భండకాడ నరసింగ్‌రావు పేర్లతో మూడు పాస్‌పోర్టులు తీసుకున్నాడు. మూడో నిందితుడు మహ్మద్ అబ్దుల్ సలామ్ తన పేరుతో ఒకటి, మహ్మద్ సలీమ్ పేరుతో మరో పాస్‌పోర్టును తీసుకున్నాడు. ప్రధాన నిందితుడు లలానీ 1997లో తన అసలు పేరు మీద తొలి పాస్‌పోర్టు తీసుకున్నాడు. చెప్పుల వ్యాపారం నిర్వహించే లలానీ 2000 సంవత్సరంలో యుఎస్‌ఏ బి1/బి2 వర్క్ వీసా కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. అదే పాస్‌పోర్టుమీద మళ్లీ వీసాకు ప్రయత్నించడం కష్టమని భావించి 2000లో వెంకట్‌శర్మ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి మరో పాస్‌పోర్టు తీసుకున్నాడు. చెన్నైలోని వీసా కార్యాలయం ద్వారా వీసాకు దరఖాస్తు చేశాడు. అక్కడి కాన్సులేట్ అధికారులు కూడా తగిన డాక్యుమెంట్లు లేవని తిరస్కరించారు. మరోసారి తన అసలైన పాస్‌పోర్టు ద్వారా యుకే, యుఎస్‌ఏ వీసాలకు దరఖాస్తు చేశాడు. అప్పుడు కూడా తిరస్కరించారు. రెండో నిందితుడు నరసింగ్‌రావు కారు డ్రైవర్‌గా హైదరాబాద్‌లో పని చేస్తూ యుఎస్‌ఏలో వర్క్ పర్మిట్ వీసా ద్వారా పని చేసేందుకు వెళ్లాలని భావించాడు. 2000లో బాల నరసింగ్‌రావు పేరుతో మరో పాస్‌పోర్టు తీసుకున్నాడు.
ఢిల్లీ కాన్సులేట్ ద్వారా యుఎస్‌ఏ వీసాకు దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించారు. ఆ తర్వాత 2001లో నకిలీ పత్రాలతో బెన్నీ నరసింగ్‌రావు పేరుతో మరో పాస్‌పోర్టు తీసుకుని ఢిల్లీ కాన్సులేట్ ద్వారా యుఎస్‌ఏ వీసాకు దరఖాస్తు చేయగా దానిని కూడా సంబంధిత అధికారులు తిరస్కరించారు. మూడో ప్రయత్నంగా భండ కాడ నరసింగ్‌రావు పేరుతో మరో పాస్‌పోర్టును తీసుకున్నాడు. 2017 సెప్టెంబర్‌లో హైదరాబాద్ బేగంపేటలోని యుఎస్ కాన్సులేట్ ద్వారా యుఎస్‌ఏ వీసాకు దరఖాస్తు చేయగా అసంపూర్తి సమాచారం ఉందని తిరస్కరించారు. మూడో నిందితుడు 1998లో తన అసలు పేరు మహ్మద్ అబ్దుల్ సలామ్ పేరుతో పాస్‌పోర్టు తీసుకున్నాడు. తిరిగి దానిని యథాతథంగా రెన్యువల్ కూడా చేయించుకున్నాడు. తర్వాత యుఎస్‌ఏకు వెళ్లి వర్క్‌పర్మిట్ మీద పని చేసేందుకు ఆసక్తి పెంచుకున్నాడు. నకిలీ ధృవపత్రాలతో హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు అధికారికి మహ్మద్ సలీం పేరుతో పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేశాడు. చెన్నై కాన్సులేట్ ద్వారా వీసాకు దరఖాస్తు చేసుకుంటే అసంపూర్తి సమాచారం ఉందని తిరస్కరించారు. తిరిగి 2000సంవత్సరంలో ఒరిజినల్ పాస్‌పోర్టు ద్వారా మళ్లీ చెన్నై కాన్సులేట్ ద్వారా వీసాకు దరఖాస్తు చేస్తే తిరస్కరించబడింది. ఈ విషయమై టాస్క్ఫోర్స్‌కు సమాచారం అందడంతో నార్త్‌జోన్ టీం ముగ్గురి నివాసాలపై దాడి చేసి అదుపులోకి తీసుకుంది. లలానీని అబిడ్స్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు, నరసింగ్‌రావును తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు, అబ్దుల్ సలాంను హుమయూన్ నగర్ పోలీసులకు తదుపరి దర్యాప్తునకు అప్పగించారు. ఈ కేసును నార్త్‌జోన్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు, ఎస్‌ఐలు పి.చంద్రశేఖరరెడ్డి, బి.శ్రావణ్‌కుమార్ తదితరులు దర్యాప్తు చేశారు.

చిత్రం..నకిలీ పత్రాలతో రెండు పాస్‌పోర్టులు పొందిన ముగ్గురు నేరస్థుల
వివరాలు వెల్లడిస్తున్న టాస్క్ఫోర్ స డీసీపీ రాధాకిషన్‌రావు