క్రైమ్/లీగల్

దోపిడీ కేసును ఛేదించిన సీసీఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 18: కొత్తపేట పోలీస్టేషన్ పరిధిలోని ప్రగతి ట్రాన్స్‌పోర్టులో దోపిడీకి పాల్పడిన కేసులో నలుగురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 3.50 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. సూర్యారావుపేట పోలీసు కాంప్లెక్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ విజయరావు వివరాలు వెల్లడించారు. పంజా సెంటర్ పాడి వీధిలోని ప్రగతి ట్రాన్స్‌పోర్టు ఆఫీసులో ఈ నెల 13న రాత్రి ముగ్గురు వ్యక్తులు క్యాషియర్‌పై కర్రలతో దాడి చేసి నగదు దోచుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. కొత్తపేట సింగరాజు వీధికి చెందిన ఎదురుబోస్లే వేణుగోపాల్(47), మహారాష్ట్ర లాతూర్ జిల్లా దేవిని మండలం బొరొల్ గ్రామానికి చెందిన విశాల్ రాజ్‌కుమార్ కోయిలే(19), కోపే మధవ్ త్రయాబక్(19), సందీప్ పాండురంగ్ యంకురే(22)లను అరెస్టు చేశారు. వేణుగోపాల్ 20ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి నగరానికి వచ్చి పల్మెంట్ రోడ్డు ట్రాన్స్‌పోర్టులో రెండేళ్లు గుమస్తాగా, తర్వాత కలకత్తా సౌత్ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో మూడేళ్లు గుమస్తాగా, తర్వాత చిన్ననాటి స్నేహితుడైన సంతోష్‌కుమార్ త్రిపాఠీకి చెందిన ప్రగతి ట్రాన్స్‌పోర్టు ఆఫీసులో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశాడు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రగతి ట్రాన్స్‌పోర్టులో చోరీ చేయాలనే ఆలోచనతో మిగిలిన నిందితులతో కలిసి వ్యూహరచన చేశాడు. ఈ నెల 13న రాత్రి ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలోకి చొరబడ్డారు. ముసుగులు ధరించి క్యాషియర్‌ను కొట్టి నగదు లాక్కొని పరారయ్యారు. సీపీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ విజయరావు వివరించారు. ప్రతిభ చూపిన అదనపు డీసీపీ ఎల్‌టీ చంద్రశేఖర్, వెస్ట్ జోన్ ఏసీపీ సుధాకర్, కొత్తపేట సీఐ ఎండీ ఉమర్, క్రైం ఎస్‌ఐలు కృష్ణ, సుబ్రహ్మణ్యం, హెడ్ కానిస్టేబుల్ ఖాదర్, కానిస్టేబుల్ నాంచారయ్య, అజయ్, రాజేష్‌లను ఆయన అభినందించారు.