క్రైమ్/లీగల్

కన్నకూతురునే కాటేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, జూలై 18: పశువుకన్నా హీనంగా ప్రవర్తించాడు ఓ తండ్రి. 11 ఏళ్ల కూతురును భయపెట్టి అత్యాచారం జరిపాడు. మూడు నెలల పాటు ఈ ఘోరం జరుగుతున్నా ఆ చిన్నారి భయంతో తల్లికి చెప్పలేకపోయింది. చివరకు అనుమానం వచ్చిన తల్లి నిలదీయడంతో జరిగిన ఘోరాన్ని ఏకరువుపెట్టింది. దీంతో ఆ తల్లి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కర్నూలు జిల్లా బనగానపల్లెలో గురువారం ఈ దారుణం వెలుగుచూసింది. ఎస్‌ఐ శివాంజల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బనగానపల్లె పట్టణంలోని పాతబస్టాండు సమీపంలో ఉన్న రంగరాజుపేటకు చెందిన కారు డ్రైవర్ తన కూతురు(11)ను భయపెట్టి అత్యాచారం జరిపాడు. 3 నెలలుగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురును బలత్కారించేవాడు. బాలిక స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. చిన్నారి నలతగా ఉండడం గమనించిన తల్లి అనుమానంతో నిలదీయడంతో జరిగిన ఘోరాన్ని వివరించి కన్నీటిపర్యంతమైంది. దీంతో కలత చెందిన ఆ తల్లి వెంటనే తన భర్తపై బనగానపల్లె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివాంజల్ తెలిపారు.