క్రైమ్/లీగల్

అమ్మఒడి పేరుతో భారీ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిద్దలూరు, జూలై 18: ‘ మేము ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం.. మీఖాతాలో నగదు జమచేస్తాం.. ఎటిఎం కార్డు, సివివి నెంబర్లు చెప్పండి, ఆపై మీ ఫోన్‌కు ఓటిపి వస్తుంది దీనిని చెబితే మీ ఖాతాలో నగదు జమ అవుతుందని ఓ అజ్ఞాతవ్యక్తి ఫోన్ చేశాడు. వివరాలన్నీ చెప్పాక ఆన్‌లైన్‌లో లక్షా 88వేల రూపాయల మేర కాజేసిన ఉదంతం ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది. బాధితుని కథనం మేరకు గడికోట గ్రామానికి చెందిన శంకుల కాశీరావు అలియాస్ కాశయ్యకు బుధవారం సిఎం కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. మీ పిల్లలు చదువుతున్నారా, మీ తమ్ముళ్ళు చదువుతున్నారా, మీ ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద నగదు వేస్తామంటూ ఆశ చూపారు. ఆ తరువాత ఎటిఎం కార్డుపై ఉన్న నెంబరు, సివివి నెంబరు తెలుసుకొని ఆన్‌లైన్‌లో లక్షా 88వేల రూపాయలను డ్రా చేసుకున్నాడు.
ఓటిపి తెలుసుకున్న అతను ఈవిధంగా నగదును డ్రా చేశాడు. అయితే కాశీరావుకు తన ఖాతా నుంచి నగదు బదిలీ అయినట్లు సెల్‌ఫోన్‌కు సమాచారం రావడంతో కంగుతిని గిద్దలూరు పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై సమందర్‌వలి వెంటనే స్పందించి బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి ఎటిఎం కార్డులను బ్లాక్ చేయించారు. అయితే అతనికి వచ్చిన ఫోన్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. నిందితుడిని పట్టుకొని నగదును రికవరీ చేస్తామని ఎస్సై సమందర్‌వలి తెలిపారు. సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎన్ని విన్నపాలు చేసినప్పటికీ, ఆశతో ఎటిఎంల నెంబర్లు చెప్పడం పరిపాటి అయిపోయిందని, ఈసైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సమందర్‌వలి తెలిపారు.