క్రైమ్/లీగల్

గ్యాంగ్‌స్టర్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 6 : కడప నగరంలోని సెంట్రల్ జైలు లో శుక్రవారం మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సునీల్‌కుమార్(35) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వి వరాల్లోకి వెళ్తే.. గ్యాంగ్‌స్టర్ సునీల్‌కుమార్‌ను గురువారం కడప జిల్లా పోలీసులు అరెస్టు చేసి, నగరంలో ని సెంట్రల్ జైలులో ఉంచారు. అయితే అతడు ఉరి వేసుకోగా జైలు సిబ్బంది గమనించి హుటాహుటిన రిమ్స్ ఆసుప్రతికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో బయటకు పొక్కింది. మార్చి 27న ఒక కేసు విషయమై కర్నూలు పోలీసులు ఎస్కార్ట్‌గా సునీల్‌కుమార్‌ను కర్నూలు కో ర్టుకు తీసుకెళ్లగా అతడు తప్పించుకున్నాడు. ఈ క్రమంలో గురువారం కడప జిల్లా పోలీసులు సునీల్‌ను అరెస్టు చేయగా ఎస్పీ పాత్రికేయుల ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం సునీల్‌ను కోర్టుకు హాజరు పరిచా రా.. లేక శుక్రవారం ఉదయం కోర్టులో హాజరు పరిచి రిమాండ్ పంపారా అనే విషయం తేలియడం లేదు.