క్రైమ్/లీగల్

వీడిన చిన్నారి కిడ్నాప్ మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్ టౌన్, జూలై 19: ఈనెల 13న కిడ్నాప్‌నకు గురైన చిన్నారి కేసు మిస్టరీని ఛేదించినట్టు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని వల్లబ్‌నగర్ ఎర్రగుంట ప్రాంతంలో పొట్టొళ్ల చిట్టి, యాదయ్య దంపతులకు చెందిన పసిపాపను గాఢనిద్రలో ఉండగా కొందరు కిడ్నాప్ చేశారు. చిన్నారి తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటోలో వచ్చిన దుండగులు పసిపాపను కిడ్నాప్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించడంతో పాటు రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లకు పాప వివరాలు తెలుపుతూ సమాచారం ఇచ్చారు. కేసు విచారణకు టాస్క్ఫోర్స్ బృందాలను అప్రమత్తం చేయడంతో పాటు బస్టాండ్, రైల్వేస్టేషన్లలో తనిఖీలు చేపట్టారు. నిరంతరంగా జరిగిన విచారణలో పట్టణంలోని వీరన్నపేటలో నిఘా పెట్టగా మహ్మద్ సలీం, తస్మిమ్, సమీనా, వాహిద్, కతీయాబేగం ఇంటి దగ్గర పాప ఉందనే సమాచారం తెలియడంతో పోలీసు బృందాలు వారి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తామే 10 వేలకు పసిపాపను అమ్ముదామనుకున్నట్టు నలుగురు నిందితులు ఒప్పకున్నారు. నిందితుల నుండి ఒక ఆటోతో పాటు నగదును స్వాధినం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. నాలుగు రోజుల్లోనే వలవేసి పట్టుకుని చిన్నారి పాపాయిని తల్లి ఒడికి చేర్చిన పోలీసు సిబ్బందికి ఆమె ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్, వన్‌టౌన్ సీఐ రాజేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.