క్రైమ్/లీగల్

ప్రియాంక అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో/న్యూఢిల్లీ, జూలై 19: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో భూ వివాదంలో చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. భూ వివాదంలో పది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కనీసం 27 మంది గాయపడ్డారు. శుక్రవారం ఉదయం వారణాసి వచ్చిన ప్రియాంకా గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి సోన్‌భద్రకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. మద్దతుదారులతో కలిసి రహదారి మార్గంలో బయలుదేరిన కాంగ్రెస్ నాయకురాలిని అక్కడే నిలిపివేశారు. ప్రియాంకను అక్రమంగా అరెస్డు చేశారని కాంగ్రెస్ మండిపడింది. ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవంలేని బీజేపీ ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ యూపీ పార్టీ ఇన్‌చార్జి జ్యోతిరాదిత్య సింధియా యూపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలో ఉన్నందునే బాధిత గ్రామానికి పంపించలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మారణకాండపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. అలాగే ఉబ్బా గ్రామ సర్పంచ్‌తో పాటు 29 మందిని అరెస్టు చేశారు. అడిషనల్ చీఫ్ సెక్రెటరీ(రెవెన్యూ) నేతృత్వంలో ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించినట్టు అసెంబ్లీలో యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. సోన్‌భద్ర ప్రాంతంలోని ఘోరావల్‌లో బుధవారం జరిగిన భూ వివాదంలో గోండు గిరిజన తెగకు చెందిన 10 మంది చనిపోయారు. దత్తాఅనే వ్యక్తి మద్దతుదారులు కాల్పులు జరిపారని అధికారులు వెల్లడించారు.
కాగా బాధితులను పరామర్శించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం ఉదయం వారణాసి వచ్చారు. బీహెచ్‌యూ ట్రామా సెంటర్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు. అక్కడ నుంచి సోన్‌భద్రకు రోడ్డు మార్గంలో బయలుదేరగా నారాయణ్‌పూర్ వద్ద పోలీసులు నిలిపివేశారు. సమీపంలోని ఛౌనార్ గెస్ట్‌హౌస్‌కు ఆమెను తరలించారు. పోలీసుల చర్యను నిరసిస్తూ గెస్ట్‌హౌస్ వద్ద ప్రియాంక ధర్నాకు దిగారు. డీఐజీ పీయూష్ కుమార్ శ్రీవాత్సవ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. నారాయణ్‌పూర్ వద్దే ప్రియాంకను కాస్సేపు అడ్డుకున్న తరువాత ఛౌనార్ గెస్ట్‌హౌస్‌కు తరలించినట్టు ఆయన వెల్లడించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికే తాను వచ్చానని, ఇందులో ఎలాంటి రాజకీయాలూ లేవని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక స్పష్టం చేశారు. 3నా కుమారుడి వయస్సున్న ఓ బాలుడు కాల్పుల్లో గాయపడ్డాడు. ఆ అబ్బాయిని పరామర్శించడానికి వెళ్తుంటే నన్ను అడ్డుకుంటున్నారు. ఇది న్యాయమా, అలాగని ఏ చట్టంలో ఉంది?2అని ప్రియాంక ప్రశ్నించారు. తనతో పాటు కేవలం నలుగురే బాధితులను పరామర్శించడానికి బయలుదేరినట్టు ఆమె తెలిపారు. 3బాధిత కుటుంబాన్ని పరామర్శించడం కనీస ధర్మం, మానవత్వం ఉన్నవారెవరైనా ఈ పనే చేస్తారు. ఇందులో మీకొచ్చిన అభ్యంతరం ఏమిటి?2అని ఆమె నిలదీశారు. స్థానిక కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ వారణాసి-మీర్జాపూర్ సరిహద్దులో ప్రియాంకా గాంధీని అడ్డుకుని, అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. కాగా తన సోదరి ప్రియాంక అరెస్టుపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. యూపీలో ప్రజాస్వామ్యం మంటగలిసిందని, బీజేపీ ప్రభుత్వం అభద్రతాభావంతో ఉందని ఆయన ధ్వజమెత్తారు. గిరిజనులు బలైపోతే బాధిత కుటుంబాన్ని పరామర్శించ కూడదా?అని ఆయన ప్రశ్నించారు. 3ప్రియాంకను అరెస్టు చేయడం ద్వారా కాల్పుల వెనక ఎవరున్నారో అర్థమవుతోంది. పది మంది గిరిజనులను చంపేసిన వ్యక్తులను కాపాడేందుకు యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది2అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు.