క్రైమ్/లీగల్

‘అయోధ్య’ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ముస్లింలలో బహుభార్యాత్వం కంటే, రామజన్మభూమి చాలా ముఖ్యమైన అంశమని, అందువల్ల దీన్ని విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ, ముస్లింల తరపున వాదిస్తున్న న్యాయవాది రాజీవ్ ధావన్, సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ముందు, అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన 14 అప్పీళ్లు ఉన్నాయి. అంతకుముందు శ్యాం బెనెగల్, తీస్తా సెతల్వాద్ వంటి వారు తమను కూడా రాజజన్మభూమి వివాదంలో పార్టీలను చేయాలని చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేవలం రామజన్మభూమికి సంబంధించిన పార్టీల పిటిషన్లను మాత్రమే విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2010లో రామజన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టు 2:1 తేడాతో తీర్పు చెబుతూ, భూమిని, సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అకారా, రామలాలాల మధ్య సమానంగా పంచాలని తీర్పు చెప్పింది.