క్రైమ్/లీగల్

9న అసెంబ్లీ సభ్యత్వం కేసును విచారించనున్న హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలంగాణ అసెంబ్లీ నుంచి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం కేసు విచారణను ఈ నెల 9వ తేదీ నుంచి హైకోర్టు ప్రారంభించనుంది. ఈ కేసులో రాష్ట్రప్రభుత్వం తరఫున న్యాయ విభాగ కార్యదర్శి వి నిరంజన్‌రావు కౌంటర్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎన్నికల సంఘం కూడా కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆరు నెలల్లో ఉపప ఎన్నికలు జరపడం ఎన్నికల సంఘం విధి అని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆరు వారాల వరకు నోటిఫికేషన్ ఇవ్వవద్దని కోర్టు జారీ చేసిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని ఎన్నికల సంఘం అఫిడవిట్‌లో పేర్కొంది. అనంతరం ఈ కేసు విచారణను 9వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.