క్రైమ్/లీగల్

మహిళపై సామూహిక అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారంచేడు, జూలై 20: ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఓ మహిళపై గుర్తుతెలియని ముగ్గురు దుండగలు శనివారం అత్యాచారం చేశారు. అత్యాచారానికి గురైన మహిళకు మూడేళ్ల క్రితం చెరుకుపల్లి గ్రామానికి చెందిన ఒకరితో వివాహం జరిగింది. అనంతరం ఏడాదిన్నర క్రితం వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఈక్రమంలో అత్యాచారానికి గురైన మహిళకు వేరొకరితో గత నాలుగు నెలలుగా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో వారిద్దరు అప్పుడప్పుడు కలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరు చీరాల నుండి కారంచేడు వైపు వస్తుండగా గుర్తుతెలియని ముగ్గురు దుండగులు మహిళను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే ఆమె వెంట వ్యక్తి వద్ద నుండి సెల్‌ఫోన్, నగదును అపహరించుకుపోయారని కారంచేడు ఎస్‌ఐ బి నరసింహారావు తెలిపారు.